సౌందర్యానికి చిట్కాలు

అందమే ఆనందం

అందంగా కనిపించాలని, దొరికిన సౌందర్య ఉత్పత్తులన్నీ వాడటం వలన వాటిలోని రసాయనాలు హ్హాని చేసే ప్రమాదం ఉంది . బదులుగా ఇంటి చిట్కాలను పాటిస్తే అందమూ , ఆరోగ్యమూ మీ సొంతమవుతాయి.

Beauty Tips
Beauty Tips

పాల మీగడలో రెండు చుక్కల నిమ్మరసం కలిపి సహనానికి వెళ్లే ముందు రాసుకోవాలి.. కాసెపాయాక కాస్త పెసర పిండిలో గులాబీ నీళ్లు కలిపి ఒంటికి పట్టించి నాలుగు పెట్టుకుని స్నానం చేస్తే.. మచ్చలు, మొటిమలు వంటివి తగ్గి ముఖం కాంతులీనుతుంది..

కీర దోస, నిమ్మరసాన్ని సమపాళ్లలో తీసుకుని చిటికెడు పసుపు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 15 నిముషాల తర్వాత గోరువెచ్చని నీతితో కడిగేసుకోవాలి. ఇలా రోజూ చేస్తుంటే, క్రమంగా చర్మ ఛాయ మెరుగుపడుతుంది.

రెండు చెంచాల నిమ్మరసంలో చెంచా తేనె , గుడ్డులోని తెల్ల సోనా వేసి బాగా గిలకొట్టాలి.. దీన్ని ముఖం, మీద, చేతులకు రాసుకుంటే, నలుపు తగ్గుతుంది.. చర్మం బిగుతుగా మారుతుంది..

చుండ్రు ఇబ్బంది పెడుతున్నప్పుడు నిమ్మ రసంలో రెండు చుక్కల ఆలివ్ నూనె కలిపి తలకు పట్టించి మర్దన చేయాలి.. ఆపై ఆవిరి పట్టి ఘాడత తక్కువ ఉండే షాంపూతో తలా స్నానం చేస్తే సరి.. వెంట్రుకలు నిగనిగ లాడతాయి.. సమస్య దూరమవుతుంది.

ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం : https://www.vaartha.com/category/andhra-pradesh/