కోకోనట్ ఖీర్..

రుచి: వెరైటీ వంటకాలు

coconut kheer
coconut kheer

కావాల్సినవి:

చిక్కటి పాలు-2 కప్పులు, (కాచి చల్లార్చుకోవాలి) కొబ్బరి బొండాం మీగడ- అర కప్పు, (ఇందులో కాచి చల్లార్చిన పాలలోంచి పావు కప్పు పాలు కలిపి, మిక్సీ పట్టుకోవాలి) , కొబ్బరి కోరు -1 కప్పు, నెయ్యి-2 టేబుల్ స్పూన్లు, పంచదార- పావు కప్పు, యాలుకల పొడి, జీడీ పప్పు ముక్కలు, పిస్తా ముక్కలు, కిస్మిస్- గార్నిష్ కి సరిపడా (అభిరుచిని బట్టి నచ్చినవి మరికొన్ని కాపులుకోవచ్చు. అయితే అన్నిటినీ దోరగా వేయించుకోవాలి)

తయారీ విధానం:

ముందుగా నేతిలో కొబ్బరి కోరు వేసుకొని గరిటెతో దోరగా వేయించుకొని, అందులో పంచదార వేసుకుని తిప్పుతూ ఉండాలి.. పంచదార పూర్తిస్ కరిగిన అనంతరం పాలు, కొబ్బరి మీగడ మిశ్రమం వేసుకుని దగ్గర పడే వరకు తిప్పుతూ ఉండాలి. అభిరుచిని బట్టి ఫుడ్ కలర్ వేసుకుని, కలిపి చివరిగా యాలకల పొడిని నేతిలో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ముక్కలు వేసుకుని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చెక్కుకునే వేడివేడిగా ఉన్నపుడే నచ్చిన విధంగా సర్వ్ చేసుకోవచ్చు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/category/news/national/