ఆందోళనను తగ్గించుకునేందుకు

To alleviate anxiety

శారీరక ఫిట్‌నెస్‌తో పాటు మానసిక ఫిట్‌నెస్‌ ఎంతో ముఖ్యం. ట్రెడ్‌మిల్‌ మీద వ్యాయామాలు, జిమ్‌లో వర్కవుట్లే కాకుండా ఆంగ్రోబిక్స్‌ అనే కొత్త రకం కసరత్తులు చేస్తే మానసికంగానూ ఫిట్‌గా ఉంటారు. ఆంగ్రోబిక్స్‌ అంటే కోపాన్ని, ఉద్రేకాన్ని తగ్గించుకోవడానికి చేసే ఎయిరోబిక్స్‌్‌. రెసిస్టంట్‌ బ్యాండ్స్‌ చేతికి తగిలించుకున్న ఈ బ్యాండ్‌ను స్ట్రెచ్‌ను చేయడం ద్వారా ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆంగ్రోబిక్స్‌లో భాగంగా బాక్సింగ్‌ కూడా చేస్తారు. బాక్సింగ్‌ ప్యాడ్స్‌ మీద పంచ్‌లు విసరడం ద్వారా ఒత్తిడి పెంచే ఆలోచనల్ని, బాధను, కోపాన్ని తరిమేయవచ్చు. వెయిట్‌ లిఫ్టింగ్‌ బరువులు ఎత్తడం వల్ల కండలు తిరిగిన దేహంతో పాటు మానసిక ఆహ్లాదం కూడా లభిస్తుంది. టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌ విడుదల పెరుగుతుంది. రోజుకు 20 నిమిషాలు బరువులు ఎత్తడం వల్ల ఉద్రేకం తగ్గి, మెదడు చురుగ్గా పనిచేస్తుంది. మెడిసినల్‌ బాల్‌ స్టామ్స్‌ రబ్బర్‌ మెడిసిన్‌ బాల్స్‌తో కూడా కోపాన్ని అదుపులో పెట్టుకోవచ్చు. గోడకు కొంచెం దూరంగా నిలబడి బంతిని విసిరాలి. ఆ బంతిని క్యాచ్‌ పట్టాలి. ఇలా కొద్దిసేపు చేయాలి. డాన్స్‌ పాటలు వింటూ వ్యాయా మాలు చేస్తే, మరింత ఉత్సాహంగా ఉంటారు. డాన్స్‌తో ఉల్లాసం కలుగు తుంది. మనసుకు నచ్చిన పాటలు, వింటూ, కాలు కదిపితే శరీరం, మనసు రెండూ ఫిట్‌ అవుతాయి.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/