బీసీల జోలికి వస్తే ఖబర్దార్ అంటూ రేవంత్ ఫై బిఆర్ఎస్ బీసీ మంత్రుల హెచ్చరిక

గత కొద్దీ రోజులుగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బీసీ లపై , ఇతర కులాల ఫై చేస్తున్న ఆరోపణలు , కించపరిచే విధంగా మాట్లాడడం ఫై బిఆర్ఎస్ మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేసారు. రాజకీయాల్లో విమర్శలు సహజం. విషయ పరంగా ఆరోపణలు, ప్రత్యారోపణలు చేయడం ప్రజాస్వామ్యంలో భాగమే. కానీ వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ దూషణలకు దిగడం మంచి పద్ధతి కాదని మంత్రి తలసాని అన్నారు. ఇటీవల ప్రెస్ మీట్లు పెట్టీ కాంగ్రెస్‌ నేతలు బీసీ నాయకులను తిడుతున్నారు. మా బీసీ నాయకులకు ఫోన్లు చేసి బెదిరింపులకు దిగుతున్నారు. వెనుకబడిన వర్గాల నాయకులు, కార్యకర్తల మీద విమర్శలు చేస్తే ఇక ఊరుకోమన్నారు.

బుధువారం తలసాని నివాసంలో బీసీ మంత్రులు గంగుల కమలాకర్‌, శ్రీనివాస్‌ గౌడ్‌ తదితరులు సమావేశమయ్యారు. ఈ సందర్బంగా మంత్రి తలసాని మాట్లాడుతూ..ఇటీవల ప్రెస్ మీట్లు పెట్టీ కాంగ్రెస్‌ నేతలు బీసీ నాయకులను తిడుతున్నారు. మా బీసీ నాయకులకు ఫోన్లు చేసి బెదిరింపులకు దిగుతున్నారు. వెనుకబడిన వర్గాల నాయకులు, కార్యకర్తల మీద విమర్శలు చేస్తే ఇక ఊరుకోమన్నారు. వాళ్లలాగా మేం పది పార్టీల్లో తిరిగి రాలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇలాంటి వారి విషయంలో ఎందుకు మౌనంగా ఉంటుందో సమాధానం చెప్పాలన్నారు. మా జోలికి వస్తే సహించమని హెచ్చరించారు.

బీసీలలో ఎదుగుతున్న నాయకత్వాన్ని చులకన చేస్తూ బరితెగించి అహంకారంతో కొంతమంది నాయకులు మాట్లాడుతున్నార‌ని మంత్రి శ్రీనివాస్ అన్నారు. బీసీల జోలికొస్తే బీసీల నాయకులు, కుల సంఘాల ప్రతినిధులు, ప్రజలు కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తారని హెచ్చ‌రించారు. బీసీల‌ను అణిచివేయాల‌ని కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తుంద‌న్నారు. త‌మ ఓట్ల‌తో గెలిచి.. త‌మ‌నే టార్గెట్ చేస్తున్నారు. బీసీ నాయ‌కుల‌ను టార్గెట్ చేసే వారి విష‌యంలో త్వ‌ర‌లోనే భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌ను ప్ర‌క‌టిస్తామ‌న్నారు.

ప్రాణాలైనా అర్పిస్తాం కానీ ఆత్మగౌరవాన్ని వదులుకోమని, వెనుకబడిన వర్గాలను రాజకీయంగా, ఆర్థికంగా, సామాజిక సమానత్వం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన కులాలను, కులవృత్తులను ప్రభుత్వం వేలకోట్లతో అభివృద్ధి చేస్తున్నదని పేర్కొన్నారు. వేల కోట్లతో ఆత్మగౌరవ భవనాలు, వేలాది గురుకులాలను నిర్మించిందని తెలిపారు.