ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోది

అచ్చ తెలుగులో ట్వీట్‌ చేసిన ప్రధాని

narendra modi
narendra modi

దిల్లీ: ప్రదాన మంత్రి నరేంద్ర మోది తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఆయన ఈ విషయాన్ని అచ్చ తెలుగులో ట్వీట్‌ చేయడం గమనార్హం. ఉగాదితో కొత్త సంవత్సరం ఆరంభమవుతుంది, ఈ సంవత్సరం ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చి, కష్టాలను అధిగమించే నూతన శక్తిని ప్రసాదస్తుందని ఆశిస్తున్నాను. ప్రజలందరూ సుఖ సంతోషాలతో, మఖ్యంగా ఆరోగ్యంతో ఉండాలని ప్రార్ధిస్తున్నాను. అని ట్వీట్‌ చేశారు. కాగా ఇదే విధంగా వివిధ భాషలలో దేశ ప్రజలకు ట్విట్టర్‌ వేదికగా పండగ శుభాకాంక్షలు తెలిపారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/