బిగ్ బాస్ ఇలా చేసేవేంటి..?

బిగ్ బాస్ ఇలా చేసేవేంటి..?

తెలుగులో బిగ్ బాస్ సీజన్ 5 సక్సెస్ ఫుల్ గా సాగుతున్న సంగతి తెలిసిందే. 19 సభ్యుల్లో ఇద్దరు ఇంటిదారి పట్టారు. ఈ వారం ఎవరు బిగ్ బాస్ కు గుడ్ బై చెపుతారో చూడాలి. ప్రస్తుతం మాత్రం హౌస్ లో కెప్టెన్సీ టాస్క్ కొనసాగుతుంది. హౌస్ కెప్టెన్‌ కావడం కోసం సభ్యులంతా గట్టిగానే ట్రై చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రేక్షకుల్లోనూ ఈ వారం ఎవరు కెప్టెన్‌ అవుతారా అని ఆసక్తి గా ఎదురుచూస్తున్న సమయంలో ఈ వారం జెస్సి హౌస్ కెప్టెన్‌ అని బిగ్ బాస్ లీక్ చేసేసాడు. మొన్నటి వరకు హౌస్ లో ఏంజరిగిందో ఓ రోజు ముందే లీక్ రాయుళ్లు సోషల్ మీడియాలో లీక్ చేస్తుంటే..ఇక ఇప్పుడు బిగ్ బాస్ సైతం నేనుమాత్రం ఏమన్నా తక్కువ అన్నట్లు హౌస్ కెప్టెన్‌ ను ముందే ప్రోమో లో లీక్ చేసాడు. బిగ్‌బాస్‌ కంటెస్టెంట్లు ఫస్ట్‌ లవ్‌ గురించి చెప్తూ ఎమోషనల్‌ అయిన ప్రోమోలో మోడల్‌ జశ్వంత్‌ చేతికి కెప్టెన్సీ బాండ్‌ కనిపించింది. దీంతో జెస్సీ ఈ వారం కెప్టెన్‌ అయ్యాడని స్పష్టమవుతోంది. అయితే అంత పెద్ద విషయాన్ని అంత ఈజీగా లీక్‌ చేశాడేంటని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

బిగ్‌బాస్‌ కంటెస్టెంట్లు కూడా వారి తొలి ప్రేమను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్‌ అయ్యారు. ఈ క్రమంలో సింగర్‌ శ్రీరామచంద్ర తన ఫస్ట్‌ లవ్‌ను గుర్తు చేసుకుంటూ ఆమెకు ఇదివరకే పెళ్లి అయిపోయి పిల్లలు కూడా ఉన్నారన్నాడు. దీప్తి సునయన కంటే ముందే తను ఒకరిని ప్రేమించానని ఓ సీక్రెట్‌ బయటపెట్టాడు షణ్ముఖ్‌. ఇక జెస్సీ తను ఓ అమ్మాయిని ప్రేమించానని, ఆమె సింగిల్‌ అయితే, తాను రెడీ టు మింగిల్‌ అని సిగ్నల్‌ ఇచ్చేశాడు. https://www.youtube.com/embed/Qi9efm-Hpz0 View this post on Instagram

A post shared by jessie (@jaswanth__jessie__)