నిరాడంబరంగా బ్రిటన్ యువరాణి వివాహం

వెల్లడించిన రాజ కుటుంబం

నిరాడంబరంగా బ్రిటన్ యువరాణి వివాహం
UK’s Prince Andrew’s Daughter Beatrice Gets Married

లండన్‌: బ్రిటన్ ప్రిన్స్ ఆండ్రూ పెద్ద కుమార్తె, రాణి ఎలిజబెత్2 మనవరాలు, యువరాణి బీట్రెస్ వివాహం నిన్న ఇటలీకి చెందిన వ్యాపారవేత్త ఎడోర్డో మేపిలీ మోజీతో నిరాడంబరంగా జరిగింది. జూలై 17న శుక్రవారం ఉదయం 11 గంటలకు విండ్సర్లోని రాయల్ లాడ్జ్‌లోని రాయల్ చాపెల్ ఆఫ్ ఆల్ సెయింట్స్ వద్ద వీరి వివాహం జరిగినట్లు రాజ కుటుంబం ఓ ప్రకటలో తెలిపింది. కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలోనే ఈ వేడుక జరిగినట్లు తెలుస్తోంది. బీట్రెస్ వయసు 31 సంవత్సరాలు కాగా, మొజ్జిని వయసు 37 సంవత్సరాలు. కొత్త జంటకు పలువురు రాజ వంశీయులు, రాజకీయ నాయకులు, ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారని పేర్కొంది. కాగా, వీరిద్దరి వివాహం మే 29న లండన్, సెయింట్ జేమ్స్ ప్యాలెస్ లో జరిపించేందుకు పెద్దలు నిశ్చయించగా, కరోనా మహమ్మారి నేపథ్యంలో, అప్పట్లో వారి వివాహం వాయిదా పడింది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/