తెలంగాణ ఉద్యోగులకు షాక్ ఇచ్చిన జగన్

తెలంగాణ రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి తాత్కాలిక ఉద్యోగాలు చేసే ఉద్యోగులకు జగన్ సర్కార్ భారీ షాక్ ఇచ్చింది. మొన్నటి వరకు ఉచిత వసతి సౌకర్యం కల్పించిన ప్రభుత్వం..ఇక నుండి ఉచిత వసతి సౌకర్యాన్ని తీసేసింది. సచివాలయం, అసెంబ్లీ, హెచ్ఓడీ విభాగాలకు చెందిన ఉద్యోగులకు వచ్చే నెల నుంచి ఉచిత ట్రాన్సిట్ వసతిని నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

నవంబర్ 1 నుంచి ఉద్యోగులు సొంత ఖర్చులతో వసతి భరించాలని ఉత్తర్వుల్లో తెలిపింది. అక్టోబర్‌ 31 వరకు మాత్రమే ఉద్యోగులకు ఉచిత ట్రాన్సిట్‌ వసతి కల్పించనున్నట్లు స్పష్టంగా తెలిపింది. రాష్ట్ర విభజనకు ముందు హైదరాబాద్‌‌లో ప్రభుత్వ శాఖల్లో తాత్కాలిక ఉద్యోగులుగా వీరంతా పని చేశారు. విభజన తర్వాత అమరావతికి ఫిఫ్ట్ అయ్యారు. అప్పటి నుంచి వారికి ప్రభుత్వమే ఉచిత వసతి కల్పిస్తూ వస్తుంది. ఇక ఇప్పుడు జగన్ తీసుకున్న నిర్ణయంతో వారంతా షాక్ లో పడ్డారు.