ఎట్టకేలకు రాజాసింగ్‌కు బెయిల్..

rajasingh

ఎమ్మెల్యే రాజాసింగ్ పై పీడీ యాక్ట్ ను హైకోర్టు ఎత్తివేసింది. అంతే కాదు ఆయనకు బెయిల్ కూడా మంజూరు చేసింది. రాజాసింగ్ మత విద్వేశాలను రెచ్చే గొట్టే వ్యాఖ్యలు చేశారన్న కారణంతో ఆయనపై ఆగస్టు 25న పీడీయాక్ట్‌ కేసు నమోదైన విషయం తెలిసిందే. దీంతో బీజేపీ జాతీయ క్రమశిక్షణ సైతం రాజాసింగ్‌పై సస్పెన్షన్‌ విధించిన విషయం విధితమే. ఇక తాజాగా రాజాసింగ్‌పై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తేసేందుకు బీజేపీ జాతీయ క్రమశిక్షణ సంఘం సానుకూలత వ్యక్తం చేసినట్లు పార్టీ రాష్ట్ర వర్గాలు పేర్కొన్నాయి. త్వరలోనే రాజా సింగ్ పై సెస్పెన్షన్ ఎత్తివేసే అవకాశం ఉందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో ఇప్పుడు ఎమ్మెల్యే రాజాసింగ్ పై పీడీ యాక్ట్ ను హైకోర్టు ఎత్తివేసింది. న్యాయస్థానం కొన్ని షరతులు విధించింది. మూడు నెలల పాటు సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టకూడదని రాజాసింగ్ ను ఆదేశించింది. జైలు నుంచి విడుదలయ్యే సందర్భంలో ఎలాంటి ర్యాలీలు చేయకూడదని నిర్దేశించింది. మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ అభ్యంతరకర పోస్ట్ లు, కామెంట్స్ చేయకూడదని తెలిపింది. హైకోర్టు ఆర్డర్ కాపీ వచ్చిన తరువాత బెయిల్ పై రాజాసింగ్ బయటకు రానున్నారు.