హిందూపురంలో కూడా సైకిల్ గాలి దిగింది

ఏపీలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోంది. ఫ్యాన్ గాలికి సైకిల్ గాలి దిగుతుంది. ఎక్కడ చూసిన జగన్ హావనే స్పష్టముగా కనిపిస్తుంది. రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగిన సరే ఫ్యాన్ ను చూసి మరి ఓటర్లు గుద్దుతున్నారు. ఇక ఇప్పుడు తెలుగుదేశం కంచుకోటల్లోను ఫ్యాన్ గాలి గట్టిగా వీస్తుంది. కుప్పం, హిందూపురం నియోజకవర్గాలు తెలుగుదేశం కంచుకోటాలని చెపుతుంటారు. ఈ రెండిటిలో టి‌డి‌పి ఇంతవరకు ఓడిపోలేదు. అలాంటిది కుప్పంలో పంచాయితీ, ఎం‌పి‌టి‌సి‌, జెడ్‌పి‌టి‌సి ఎన్నికల్లో టీడీపీ దారుణంగా ఓడింది. కుప్పంలో మొత్తం 66 ఎం‌పి‌టి‌సిలు ఉంటే టి‌డి‌పి గెలిచింది 3 మాత్రమే. ఒక జెడ్‌పి‌టి‌సి స్థానం కూడా గెలుచుకోలేదు. అంటే టి‌డి‌పి పరిస్థితి ఎలా ఉందో చెప్పాల్సిన పని లేదు. అందుకే కొడాలి నాని సైతం….నెక్స్ట్ కుప్పంలో చంద్రబాబు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పుకొచ్చారు.

ఇక నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురంలో కూడా వైసీపీ గాలి కొనసాగుతుంది. పంచాయితీల్లో వైసీపీ ఆధిక్యం సాధించింది. హిందూపురం మున్సిపాలిటీని వైసీపీ కైవసం చేసుకుంది. ఇక 43 ఎం‌పి‌టి‌సి స్థానాల్లో టి‌డి‌పి గెలిచింది 7 మాత్రమే. అంటే హిందూపురంలో కూడా ఫ్యాన్ గాలి గట్టిగా వీస్తోందని చెప్పాల్సిన పనిలేదు. మొత్తం మీద రాష్ట్రంలో జగన్ రావడం పక్క అని ఈ ఎన్నికల ఫలితాలే చెపుతున్నాయి.