సోషల్ మీడియా టాక్ : ఫ్రెండ్ షిప్ అనే అర్ధాన్ని చెడగొడుతున్న షణ్ముఖ్ – సిరి

సోషల్ మీడియా టాక్ : ఫ్రెండ్ షిప్ అనే అర్ధాన్ని చెడగొడుతున్న షణ్ముఖ్ - సిరి

ఫ్రెండ్ షిప్ అనే అర్ధం పరువు తీస్తున్నారు సిరి – షణ్ముఖ్ లు. బిగ్ బాస్ హౌస్ లో వారి రొమాంటిక్ కోరికలు తీర్చుకోవడం కోసం ఫ్రెండ్ షిప్ పేరు చెప్పి హగ్స్ చేసుకుంటూ..ముద్దులు పెట్టుకుంటున్నారు. ఈ దరిద్రం ఇంకెన్నాళ్లు చూడాలో ఏమో కానీ.. ఓవైపు సిగ్గులేకుండా కనెక్ట్ అయిపోయాం.. తప్పని తెలిసినా తప్పడం లేదు అని నిస్సిగ్గుగా తమ కామకేళి గురించి పబ్లిక్‌గా నాగార్జున ముందే ఒప్పుకున్నారు.. ఇప్పుడు మాటి మాటికీ హగ్ చేసుకుంటూ.. పాపం ఆ తల్లి గురించి ఎందుకు ప్రస్తావించుకుంటున్నాయో ఈ జంటపాములు అంటూ సోషల్ మీడియా లో సిరి – షన్ను ల ఫై కామెంట్స్ వేస్తున్నారు.

హౌస్ లోకి వచ్చి తల్లిదండ్రులు కాస్త దూరంగా ఉండండి..హగ్స్ చేసుకోకండి..ఎవరి గేమ్ వారు ఆడండి అంటూ చెప్పినప్పటికీ సిరి , షన్ను లు మాత్రం వారి మాటలను ఏమాత్రం పట్టించుకోకుండా లేచిన దగ్గరి నుండి పడుకునే వరకు హగ్స్ చేసుకోవడం , ముద్దులు ఇచ్చుకోవడం , సారీ లు చెప్పుకోవడం చేస్తూ ఇంకా పరువు తీసుకుంటున్నారు. సోమవారం ఎపిసోడ్ లో కూడా అదే జరిగింది. హగ్ ఇవ్వరా.. చాలా హ్యాపీగా ఉందిరా.. అని సిరి షన్ను ను అడగగానే..షణ్ముఖ్.. ఫ్రెండ్ షిప్ హగ్ అని మీ మమ్మీతో చెప్పు అని అంటాడు. వెంటనే సిరి.. ‘మమ్మీ.. ఇది నిజంగా ఫ్రెండ్ షిప్ హగ్ మమ్మీ’ అని చేతులు చాపుకుని షణ్ముఖ్ వెచ్చని కౌగిట్లోకి వాలిపోతుంది.. అతను హగ్ ఇస్తుంటే.. ఫుల్‌గా అంటూ షణ్ముఖ్‌ని గట్టిగా పట్టుకుంటుంది. ఈ సీన్ చూసి వీరిద్దరిని హగ్స్ ఇచ్చుకునేందుకే బిగ్ బాస్ హౌస్ లో బిగ్ బాస్ ఉంచుతున్నారు కావొచ్చు అంటూ బిగ్ బాస్ ఫై , హోస్ట్ చేస్తున్న నాగార్జున ఫై నెటిజన్లు , ప్రేక్షకులు విమర్శలు చేస్తున్నారు.