ప్రజావిశ్వాసాన్ని కోల్పోతున్న బ్యాంకులు

Bank
Bank

వ్యక్తులపై కానీ, సంస్థలపై కానీ ప్రజా విశ్వాసం, నమ్మకం అనేవి ఒకటి రెండు రోజుల్లో ఏర్పడేవికావ్ఞ. ఇంకెవరో చెప్తే వచ్చే వికావ్ఞ. ఏళ్లతరబడి వ్యవహరించిన తీరు, అందించిన సేవలు తదితర అంశాల ఆధారంగా ఏర్పడతాయి. మన దేశంలో బ్యాంకులు గత నాలుగు దశాబ్దాలుగా అందించిన సేవలతో ప్రజల్లో ఎంతో విశ్వాసం ఏర్పడింది. అందులోనూ ప్రధానంగా బ్యాంకుల జాతీయకరణ జరిగిన పిదప మధ్య తరగతి ప్రజలేకాక సన్నజనం కూడా బ్యాంకుల బాటపట్టా రు. తమ సొమ్ము బ్యాంకుల్లో భద్రంగా ఉంటుందని అపా రమైన నమ్మకంతో పెద్దఎత్తున డిపాజిట్‌లు చేశారు. ఒక రకంగా చెప్పాలంటే పొదుపు చేయడం కూడా అలవాటు చేసుకున్నారు. బ్యాంకుల ఖాతాల సంఖ్య కోట్లకు పెరిగి పోయింది. వ్యాపార లావాదేవీలు పెరిగిపోయాయి. మరొక పక్క సన్న,చిన్నజనానికి కూడా బ్యాంకులు రుణసహాయం చేసి వారి అభివృద్ధికి బాటలు వేశాయి. ప్రజల్లో ఇంత ఆదారాభిమానాలు చూరగొన్న బ్యాంకులపై నేడు నమ్మకాలు క్రమేణ సన్నగిల్లుతున్నాయి. ఒక్కొక్క బ్యాంకులో జరుగు తున్న కుంభకోణాలు బయటపడటం, పెద్దలు వేలాది కోట్లు బ్యాంకులకు ఎగనామం పెట్టి విదేశాలకు పారిపోతుండ టంతో బ్యాంకింగ్‌ వ్యవస్థ సంక్షోభంలో పడుతున్నదేమో అనే అనుమానాలు వ్యక్తమవ్ఞతున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు వరుసగా ఎన్నో బ్యాంకుల ఆర్థిక పరిస్థితి సంక్షోభంలో పడటంతో దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఖాతా దారుల పరిస్థితి ఆందోళనకరంగా తయారవ్ఞతున్నది. కేంద్ర ప్రభుత్వం, రిజర్వుబ్యాంకు ఆఫ్‌ ఇండియా ఏదో తాత్కాలిక చర్యలు తీసుకుంటున్నా ఈ కుంభకోణాలు పునరావృతం కాకుండా అడ్డుకోలేకపోతున్నాయి. ఎప్పటి కప్పుడు చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నా అవి మాటలకే పరిమితమ వ్ఞతున్నాయి. పంజాబ్‌, మహారాష్ట్ర కో ఆపరేటివ్‌ బ్యాంకు లు కుప్పకూలి ఆరు నెలలు కాకముందే ఇప్పుడు తాజాగా ఎస్‌ బ్యాంకు కుంభకోణం బయటపడింది.యాభైవేల రూపా యలకు మించి డ్రా చేసుకోరాదనే ఆంక్షలు విధించారు. అయితే ఒక నెలరోజుల్లో ఈ పరిమితిని ఉపసంహరిస్తా రని తాజా వార్తలు వెలువడుతున్నాయి. ఈ బ్యాంకులో భారీ కుంభకోణం జరిగినట్లు వెలుగుచూసింది. సిబిఐ సోమవారం నుంచి తన దర్యాప్తును వేగవంతం చేసింది. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ రాణాకపూర్‌ కుటుంబానికి అందాయంటూ ఆరోపణలు వచ్చినా ఆరువందల కోట్ల రూపాయల ముడు పులతో సంబంధం ఉన్న ఏడు ప్రాంతాల్లో సిబిఐ సోదాలు నిర్వహించింది. రాణాకపూర్‌ కుటుంబంతోపాటు డీహెచ్‌ ఎఫ్‌ఎల్‌ ప్రమోటర్లు ఎవరూ దేశం విడిచి వెళ్లకుండా సిబిఐ లుకౌవ్ఞట్‌ నోటీసులు జారీ చేసింది. సిబిఐ ఎఫ్‌ఐఆర్‌లో రాణాకపూర్‌ భార్య ముగ్గురు కుమార్తెలు సహా ఏడుగురు వ్యక్తులు, ఐదు కంపెనీలతోపాటు మరికొందరు పేర్లను చేర్చింది. కపిల్‌ వాద్వాన్‌తో కలిసి రాణాకపూర్‌ మోసపూరిత కుట్రకు పాల్పడ్డారని సిబిఐ ఆరోపిస్తుంది. 2018 ఏప్రిల్‌, జూన్‌ మధ్య డీహెచ్‌ ఎఫ్‌ఎల్‌ స్వల్పకాలిక డిబెంచర్లలో ఎస్‌ బ్యాంకు రూ. 3,700 కోట్లుపెట్టుబడులు పెట్టిందని సిబిఐ ప్రాథమిక దర్యాప్తులో బయటపడింది. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌కు చెందిన ఆర్‌కెడబ్ల్యుకు రూ.750 కోట్ల రుణాలు మంజూరు చేసింది. ఇందుకు ప్రతిగా రాణాకపూర్‌ కుమార్తెలకు చెందిన డ్యూయిట్‌ అర్బన్‌ వెంచర్స్‌లో వాద్వాన్‌ రూ.600 కోట్లు పెట్టుబడి పెట్టారనే ఆరోపణలపై సిబిఐ దృష్టిసారించింది.

ఎస్‌ బ్యాంకు అడ్మినిస్ట్రేటర్‌గా ప్రశాంత్‌ కుమార్‌ను ఆర్‌బిఐ నియమించింది.సాధ్యమైనంత త్వరగా వినియోగదారులకు అన్ని సేవలు పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇవన్నీ తాత్కాలికమైన ఉపశమనాలుగానే చెప్పొచ్చు. అసలు ఎందుకు ఈ కుంభకోణాలు జరుగుతున్నాయి? పూర్తిగా చేతులు దాటిపోయే దాకా ఎందుకు చూస్తున్నారు? 2019 నుంచే ఎస్‌ బ్యాంకు దివాలా బాటవైపు పడుతుందనే సంకేతాలు వెలువడుతున్నాయి.2019మార్చి, సెప్టెంబరు నెలల్లోనే డిపాజిట్లు భారీగా తగ్గిపోయాయి. బ్యాంకుపై నమ్మకం సన్నగిల్లడంతో 18వేల ఒకవంద కోట్ల డిపా జిట్లు వినియోగదారులు ఆ సమయంలో ఉపసంహరిం చుకున్నారు. బ్యాంకుల్లో ఇలా కుంభకోణాలు జరగడం ఇది మొదలు కాదు, చివర కూడా కాదు. భారతదేశంలో బ్యాంకులకు దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయ లకుపైగా బాకీపడిన కింగ్‌ఫిషర్‌ విమానాల యజమాని విజ§్‌ు మాల్యా దేశాన్ని విడిచి పారిపోయాడు. ఆయనను స్వదేశానికి రప్పించడం ఇన్నేళ్ల తర్వాత కూడా సాధ్యంకావడం లేదు. ఆయనకు అత్యంత ఉదారంగా వేల కోట్ల రూపాయల అప్పు ఇచ్చిన బ్యాంకులు వాటిని రానిబాకీల కింద పద్దురాసుకొని మౌనంగా ఉండటం తప్ప ఏమీ చేయలేకపోతున్నాయనే విమర్శలు కూడా వస్తున్నాయి. నీరవ్‌ మోదీ కేసు కూడా ఇందుకు విరుద్ధమేమీ కాదు. ఆయన కూడా విదేశాలకు వెళ్లిపోయారు. ఇదే పరిస్థితి కొనసాగితే మరెన్నో బ్యాంకులు దివాలాబాట పట్టకతప్పదని ఆర్థిక రంగ నిపుణులే అభిప్రాయపడుతున్నారు. ఇంత ఆర్థికసం క్షోభానికి కారణం రైతులకు ఇచ్చిన రుణాలు కావ్ఞ. లక్షలాది మంది చిన్నచితక పారిశ్రామికవేత్తలు తీసుకున్న అప్పులు కావ్ఞ. రిజర్వుబ్యాంకు నుంచి వచ్చే సొమ్మును ఖాతాదారులకు ఇవ్వడమే తప్ప ఖాతాదారుల నుంచి నగదును మళ్లీ రాబట్టలేకపోతున్నాయి. ముఖ్యంగా రెండువేల రూపాయల నోట్లు తిరిగి బ్యాంకుల్లో జమకావడం లేదు. ఇది దేశ ఆర్థికరంగానికి ఎంతో ప్రమాదకరమైన పరిణామం. దీనికితోడు బ్యాంకుల ద్వారా లావాదేవీలు కొనసాగితే ఇన్‌కంటాక్స్‌ అధికారులు ఇళ్లపై వచ్చిపడతారన్న భయం కూడా మధ్యతరగతి ప్రజల్లో పెరిగిపోతున్నది. ఇంకొకపక్క లావాదేవీలపై విపరీతంగా పెంచిన సేవాపన్నులు కూడా సామాన్యులను బ్యాంకు మెట్లు ఎక్కనీయకుండా చేస్తున్నాయి. క్రమేపీ ప్రజల్లో బ్యాంకుల పట్ల అపనమ్మకం పెరిగిపోతున్నది.