పెగాసిస్టమ్స్ ఇండియాతో చేతులు కలిపిన లక్ష్మి మంచు యొక్క టీచ్ ఫర్ చేంజ్

హైదరాబాద్ లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేపట్టడం ఈ భాగస్వామ్య లక్ష్యం.

Teach for Change by Lakshmi Manchu in association with Pegasystems India

హైదరాబాద్‌ః నటి, నిర్మాత మరియు మహాదాత, లక్ష్మీ మంచు యొక్క టీచ్ ఫర్ చేంజ్ సంస్థ, పెగాసిస్టమ్స్ ఇండియాతో కలిసి తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని జాఫర్‌గూడలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో సమగ్ర అభివృద్ధి కార్యక్రమాన్ని రూపొందించాయి. జాఫర్‌గూడలోని పునర్నిర్మించిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో టీచ్ ఫర్ చేంజ్ చైర్‌పర్సన్ లక్ష్మి మంచు, పెగాసిస్టమ్స్‌ ఇండియా & ఇంటర్నేషనల్ కార్పొరేట్ లా, లీడ్ కౌన్సెల్ శ్రీ ధరణి కోట సుయోధన్ మరియు హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి రోహిణి దేవి పాల్గొన్నారు. ఈ వేడుక, ఈ ప్రాంతంలోని ఈ తరహా అనేక పాఠశాలల సమగ్ర అభివృద్ధి కార్యక్రమ ప్రారంభ సూచికగానూ నిలుస్తుంది.

విద్యార్థులకు అనుకూలమైన అభ్యాస వాతావరణాన్ని సృష్టించడం కోసం తగిన సదుపాయాలు ఈ పాఠశాలలో కల్పించబడ్డాయి. లక్ష్మి మంచు నాయకత్వంలో, టీచ్ ఫర్ చేంజ్ వివిధ విద్యా కార్యక్రమాల నిర్వహణలో ముందంజలో ఉంది, టీచ్ ఫర్ చేంజ్ యొక్క ప్రధాన సీఎస్ఆర్ భాగస్వామిగా ధరణికోట సుయోధన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పెగాసిస్టమ్స్ ఉంది. ఈ కార్యక్రమం గురించి చైర్‌పర్సన్ & టీచ్ ఫర్ చేంజ్ వ్యవస్థాపకురాలు లక్ష్మి మంచు మాట్లాడుతూ, “టీచ్ ఫర్ చేంజ్‌తో ఇంత ఉన్నతమైన మిషన్‌ను ప్రారంభించినందుకు పెగాసిస్టమ్స్ ఇండియాకు నేను కృతజ్ఞతలను తెలుపుతున్నాను. జాఫర్‌గూడలో మీరు చూసినది చాలా సుదీర్ఘ ప్రయాణానికి ప్రారంభం మాత్రమే. అవసరంలో ఉన్న ప్రతి విద్యార్థికి మార్పు తీసుకురావడానికి మేము కట్టుబడి ఉన్నాము, పెగాసిస్టమ్స్ వంటి భాగస్వాములు సహకారం ఆ లక్ష్యం చేరుకోగలమనే భరోసానిస్తుంది” అని అన్నారు ప్రారంభోత్సవ వేడుక కేవలం మౌలిక వసతుల అభివృద్ధి వేడుకగా కాకుండా, టీచ్ ఫర్ చేంజ్, పెగాసిస్టమ్స్ మరియు స్థానిక విద్యా అధికారుల సహకార ప్రయత్నాలకు నిదర్శనం. ఈ సమిష్టి కృషి విద్యలో సానుకూల మార్పును తీసుకురావడంలో భాగస్వామ్య శక్తిని ప్రదర్శిస్తుంది, ఇది వేలాది మంది విద్యార్థుల జీవితాలపై శాశ్వత ప్రభావాన్ని చూపుతుంది.