ప్రణబ్‌ మృతికి బంగ్లాదేశ్‌ ఘన నివాళి

జాతీయ జెండా స‌గం అవ‌న‌తం

bangladeshs-national-flag

ఢాకా: బంగ్లాదేశ్‌ భారత మాజీ రాష్ర్ట‌ప‌తి ప్రణబ్ ముఖర్జీకి ఘ‌న నివాళి అర్పించింది. ఆ దేశం నేడు జాతీయజెండాను సగానికి అవ‌న‌తం చేసింది. ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ మృతికి నివాళిగా బంగ్లాదేశ్ బుధ‌వారం జాతీయ సంతాప దినంగా పాటిస్తోంది. దేశ ప్ర‌జ‌ల‌కు సుప‌రిచిత వ్య‌క్తి, బంగ్లా ప్ర‌ధాని షేక్ హ‌సీనాతో స‌న్నిహిత సంబంధాలు క‌లిగి ఉన్న వ్య‌క్తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ. ఆయ‌న సోమ‌వారం మ‌ర‌ణించిన కొన్ని గంట‌ల‌కే బంగ్లా ప్ర‌ధాని భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీకి సంతాపం తెలియ‌జేస్తూ లేఖ రాశారు. బంగ్లాదేశ్ నిజ‌మైన స్నేహితుడి కోల్పోయింద‌న్నారు. బంగ్లా ప్ర‌జ‌లు ప్ర‌ణ‌బ్‌ను ఎల్ల‌ప్పుడూ గౌర‌వించేవార‌న్నారు. ప్ర‌జ‌ల‌ ప్రేమాభిమానాల‌ను పొందిన వ్య‌క్తి అన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/