బస్సు ప్రమాదం..13 మంది మృతి

13 dead, 21 hurt in Mexican bus crash

మెక్సికో: మెక్సికో ఆగ్నేయ ప్రాంతంలో సోమవారం తెల్లవారుజూమున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో అతివేగంగా వెళ్తున్న బస్సు అదుపుతప్పి రోడ్డు దిగువకు దూసుకెళ్లి గోడను ఢీకొట్టింది. ఈ దుర్ఘుటనలో 13 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో 21 మందికి గాయాలయ్యాయని స్థానిక అధికారులు తెలిపారు. గ్వాటేమాల సరిహద్దులోని చియాపాస్ రాష్ట్రం లా ట్రినిటేరియా ఫంటేరియా కోమలపా పట్టణాల మధ్య ప్రమాదం జరిగిందని ఆ రాష్ట్ర ప్రానిక్యూటర్‌ జనరల్‌ కార్యాలయం పేర్కొంది. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఎనిమిది మంది పురుషులున్నారని తెలిపింది. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/