కుమ్రంభీం జిల్లా ఆసిఫాబాద్‌లో డీజీపీ పర్యటన

ఆసిఫాబాద్: తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి కొమ్రంభీం-ఆదిలాబాద్-ఉట్నూర్ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. నెల రోజుల క్రితం జరిగిన ఎన్కౌంటర్, మావోయిస్టు కదలికలపై ఆయన ఆరా తీశారు. ఎస్పీ విష్ణు వారియర్‌తో కలిసి డీజీపీ ఏరియల్ సర్వే నిర్వహిస్తారని ప్రచారం జరుగుతోంది. హెలీప్యాడ్ వద్దనే అధికారులతో సమీక్ష నిర్వహించారు. అక్కడి నుండి ఉట్నూర్ బయల్దేరి వెళ్లారు. అయితే డీజీపీ పర్యటనను పోలీస్ అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/