మా అన్న రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు అంటూ బండ్ల గణేష్ ట్వీట్

బండ్ల గణేష్ చెప్పిందే జరిగింది..తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించింది..రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడు..రేపు LB స్టేడియం లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. గత రెండు రోజులుగా కాంగ్రెస్ అధిష్టానం ఎవర్ని సీఎం గా ప్రకటిస్తుందో అని అంత ఆసక్తిగా , టెన్షన్ గా ఎదురుచూసారు. వారి ఉత్కంఠ కు తెరదించుతూ..రేవంత్ ను సీఎం గా ప్రకటించారు. రేవంత్ ను సీఎం గా ప్రకటించడం తో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు , అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

ఇక నిర్మాత , సినీ నటుడు బండ్ల గణేష్ సైతం తన సంతోషాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ‘తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నియమితులైన మా నాయకుడు, నిరంతరం నా శ్రేయస్సును కోరుకునే మా అన్న ఎనుముల రేవంత్ రెడ్డికి హృదయపూర్వక శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేశారు. ‘నాడు బూర్గుల (1952), నేడు ఎనుముల( 2023)… పాలమూరు నుండి ముఖ్యమంత్రులు’ అంటూ మరో ట్వీట్ చేశారు.

కాంగ్రెస్ శాసన సభా పక్ష సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రిగా ఏకగ్రీవంగా ఎన్నికైన రేవంత్ రెడ్డి పాలనలో అందరినీ కలుపుకొని పోయి, ప్రగతిశీల, పారదర్శక పాలన అందిస్తారని నాకు నమ్మకం ఉందంటూ సిద్ధరామయ్య ట్వీట్ చేశారు. దీనిని బండ్ల గణేశ్ రీట్వీట్ చేశారు.