సోషల్‌ మీడియాలో బండి సంజయ్‌ వీడియో వైరల్‌

bandi-sanjay

గత కొద్దీ రోజులుగా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పేరు తెగ వైరల్ గా మారింది. అధ్యక్ష పదవి నుండి బండి సంజయ్ ని తప్పించి కేంద్ర పదవి ఇవ్వబోతున్నారనే వార్తలు చక్కర్లు కొడుతుండగా..తాజాగా సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరింత వైరల్ గా మారాయి.

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ బీజేపీ సీనియర్‌ కార్యకర్తల సమ్మేళనంలో బండి సంజయ్‌ మాట్లాడుతూ… కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌, ఇతర సీనియర్‌ నేతల ముందే ఆయన తన పార్టీకి అభ్యర్థులు కరువయ్యారని వాపోవటం గమనార్హం. బండి మాటలతో బీజేపీ శ్రేణులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యాయి. ఎంత నిజాలైతే మాత్రం ఇంత బాహాటంగా చెప్తే ఎలా అంటూ నేతలు మాట్లాడుకోవటంమొదలుపెట్టారు.