ఉక్రెయిన్‌కు ఈయూ నుంచి యుద్ధ విమానాలు

తమ సైన్యం ఆపరేట్ చేయగల విమానాలు కావాలన్న ఉక్రెయిన్
ఆ రకం ఫైటర్ జెట్లు పంపిస్తున్న ఈయూ

న్యూఢిల్లీ: రష్యాతో తలపడుతున్న ఉక్రెయిన్‌కు అన్ని వైపుల నుంచి మద్దతు లభిస్తోంది. మూడు వైపుల నుంచి చుట్టుముట్టి దురాక్రమణకు పాల్పడుతున్న రష్యాపై చేతనైనంత మేర పోరాడుతున్న ఉక్రెయిన్‌కు యుద్ధ విమానాలు పంపాలని యూరోపియన్ యూనియన్ దేశాలు నిర్ణయించాయి. ఈ మేరకు కూటమి విదేశాంగ విధాన చీఫ్ జోసెప్ బోరెల్ తెలిపారు. రష్యా వైమానిక, భూతల దాడులను ఎదురొడ్డేందుకు ఫైటర్ జెట్లను అందించాలని నిర్ణయించినట్టు చెప్పారు.

తాము కేవలం బాంబుల గురించి మాత్రమే మాట్లాడడం లేదని, యుద్ధానికి అవసరమైన మరిన్ని ముఖ్యమైన ఆయుధాలను అందించాలని నిర్ణయించినట్టు తెలిపారు. రష్యాను ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్ సైన్యం ఆపరేట్ చేయగల రకమైన ఫైటర్ జెట్లు కావాలని, కొన్ని దేశాల వద్ద ఈ రకమైన యుద్ధ విమానాలు ఉన్నాయని ఆ దేశ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా ఈయూని అభ్యర్థించారు. దీంతో స్పందించిన ఈయూ ఆ రకమైన యుద్ధ విమానాలను పంపించనున్నట్టు ప్రకటించింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/