బిగ్ బాస్ 5 : ఉమాదేవి ఉగ్రరూపం..నేనేం వెర్రి** కాదంటూ బూతులు

బిగ్ బాస్ 5 : ఉమాదేవి ఉగ్రరూపం..నేనేం వెర్రి** కాదంటూ బూతులు

బిగ్ బాస్ 5 రెండో వారం నామినేషన్ పక్రియ బూతులతో సాగింది. మొదటి వారానికి గాను సరియు ఎలిమినేషన్ అవ్వగా..మిగిలిన 18 మంది సబ్యులకు గాను సోమవారం నామినేషన్ పక్రియ చేపట్టారు బిగ్ బాస్. నామినేషన్ ప్రక్రియ కోసం బిగ్ బాస్ రెండు టీంలుగా కంటెస్టెంట్లను విడగొట్టారు. నక్క(వూల్ఫ్), ఈగల్ (గ్రద్ద) అంటూ రెండు టీంలుగా విభజించారు. ఇందులో ఉమా, లహరి, మానస్, జస్సీ, రవి, సన్నీ, శ్వేత వర్మ, నటరాజ్, కాజల్ వోల్ఫ్ (నక్క) టీంలో ఉన్నారు. లోబో, విశ్వ, ఆనీ, శ్రీరామ చంద్ర, ప్రియ, హమీద, సిరి, షణ్ముఖ్, ప్రియాంకలను బిగ్ బాస్ ఈగిల్(గ్రద్ద) టీంలో సెట్ చేశారు. ఇక ఓ టీంలోని సభ్యులను తమ టీమ్ లోని వారిని కాకుండా ఇతర టీంలోని ఇద్దరు సభ్యులను నామినేట్ చేయాల్సిందిగా రూల్ పెట్టాడు బిగ్ బాస్.

ఈ క్రమంలో ఉమాదేవి తనలోని మరో యాంగిల్ ను బయటకు తీసి బండ బూతులు అనేసింది. నామినేషన్ లో భాగంగా విశ్వ.. కంటెస్టెంట్లు కూర లేదన్నప్పుడు నాగార్జున ఇచ్చిన ఆలూ కూర వారికి పెట్టకపోవడం సరికాదంటూ ఉమాదేవిని నామినేట్‌ చేశాడు. విశ్వ నామినేషన్ కు కారణం చెప్పిన ఉమా సీరియస్ అయింది. నువ్వు చెప్పిన కారణం చాలా సిల్లీగా ఉంది అని అంటూనే నేను నాగార్జున గారు నాకు కర్రీ పంపిన వెంటనే ఇది మా హౌస్ సభ్యులు అందరూ కలిసి తినవచ్చా అని అడిగాను కానీ ఆయన నువ్వు ఒక్కదానివే తినాలి అని కచ్చితంగా చెప్పారు, నాగార్జున గారు లాంటి ఒక హోస్ట్ చెప్పిన తర్వాత కూడా ఆయన మాట కాదు అని నేను మిగతా వాళ్లకు ఎలా ఇస్తాను? అలా ఇస్తే నా అంత వెర్రి** ఉండదు అని దారుణంగా మాట్లాడేసింది ఉమా. ఆమె మాట్లాడిన మాటలకు హౌస్ సభ్యుల మైండ్లు అన్నీ ఒక్కసారిగా బ్లాక్ అయ్యాయి. ఎవరూ ఊహించనటువంటి ఆ మాటలు కొందరికి నవ్వు తెప్పించగా కొందరికి షాక్ తగిలేలా చేశాయి.

షన్ను అయితే అరేయ్ ఏంట్రా ఇది అని అర్థం వచ్చేలా నోరెళ్ళబెట్టి చూస్తూ ఉండిపోయాడు. మరోపక్క ప్రియాంక సింగ్ అయితే కింద పడి మరీ నవ్వేసింది. అయితే ఇదంతా ఉమా ఒక కంట కనిపెడుతూనే ఉంది. ఇక విశ్వ నామినేషన్ పూర్తయిన తర్వాత ఉమా వంతు వచ్చిన తర్వాత ఆమె మరోసారి రెచ్చిపోయింది. యానీ మాస్టర్, విశ్వలను నామినేట్ చేసిన ఉమ బిగ్ బాస్ ఇంట్లో ఒకరకంగా పెను విధ్వంసానికి తెగబడింది. రంగంలోకి దిగుతూనే కాజల్ వంక చూసి నా పుట్టలో వేలు పెడితే నేను వదులుతానా, కాజల్ నీ డైలాగే వాడుతున్న ఫుల్ రేటింగ్స్ రాకపోతే నన్ను అడుగు అంటూ తనను నామినేట్ చేసిన విశ్వ అలాగే ఆనీ మాస్టర్ ఇద్దరిని నామినేట్ చేస్తూ పెద్ద చేసింది. విశ్వ కావాలనే తనను టార్గెట్ చేస్తున్నాడు అని చెప్పుకొచ్చిన ఉమాదేవి దమ్ము, ధైర్యం ఉంటే తనతో ఫేస్ టు ఫేస్ ఆడాలని అంతేగాని ఇలా పిచ్చి పిచ్చి కారణాలు చెప్పి నామినేషన్స్ చేస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చింది.

ఇక శ్వేత వర్మ సైతం రెచ్చిపోయింది. లోబో.. టాస్క్‌ ఆడగా, పని చేయగా చూడలేదంటూ శ్వేతను నామినేట్‌ చేశాడు. రవి తనకు టఫ్‌ కాంపిటీషన్‌ అని, అతడితో దోస్తానా వద్దని దండం పెట్టేసి యాంకర్‌కు రంగు పూశాడు. తర్వాత వచ్చిన శ్వేత అసలు రంగులు బయటపడుతున్నాయంటూ లోబో కట్టిన ఫ్రెండ్‌షిప్‌ బ్యాండ్‌ను పడేసింది. నా లైఫ్‌లో నన్ను ఎవరూ సపోర్ట్‌ చేయలేదు. ఒక్కదాన్నే ఇక్కడి దాకా వచ్చానని ఆవేశపడింది. కాజల్‌, ప్రియ లేనప్పుడు వాళ్ల గురించి మాట్లాడావు, ఇప్పుడు మాత్రం సేఫ్‌ గేమ్‌ ఆడుతున్నావంటూ లోబోకు ఇచ్చిపడేసింది. సెట్‌ శ్వేత లేదని ఎలా అన్నావు? అంటూ హమీదా మీద చిందులు తొక్కింది. మీరిద్దరూ ఫేక్‌ అని తిట్టిపోసింది. మొత్తం మీద రెండో వారం నామినేషన్ పక్రియ హాట్ హాట్ గా సాగింది.