కొత్త పార్లమెంట్ కు అంబేద్కర్ పేరు పెట్టండంటూ కేంద్రాన్ని కోరిన బండి సంజయ్ లేఖ

పార్లమెంటు భవనానికి భారత రాజ్యంగ ముసాయిదా కమిటీ ఛైర్మన్ భారత రత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలనే డిమాండ్ రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ సైతం నూతన పార్లమెంట్ కు అంబేద్కర్ పేరు పెట్టండంటూ కేంద్రాన్ని కోరారు. నూతన పార్లమెంట్ భవనానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ పేరు పెట్టానని ప్రజా గాయకుడు గద్దర్ ఇచ్చిన వినతి పత్రాన్ని ఆయన కేంద్రానికి పంపారు. కాగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా సెంట్రల్ ఇష్టాకు అంబేద్కర్ పేరు పెట్టాలంటూ అసెంబ్లీలో తీర్మానం చేసిన సంగతి తెలిసిందే.

ఇప్పటికే కొత్తగా నిర్మించిన పార్లమెంటు భవనానికి డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ పేరు పెట్టడం సముచితమనే డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. దళిత సంఘాలతో పాటు పలు పార్టీలు కూడా ఈడిమాండ్ చేస్తున్నాయి. తాజాగా దేశ అత్యున్నత చట్టసభకు రాజ్యాంగ నిర్మాత, మహాదార్శనికుడు, సామాజిక న్యాయ పోరాట రథసారథి డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్‌ పేరుపెట్టాలన్న తీర్మానాన్ని తెలంగాణ శాసన సభ ఆమోదించిన విషయం తెలిసిందే. ఢిల్లీలో కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనానికి రాజ్యంగ నిర్మాత డాక్టర్.బి.ఆర్ అంబేద్కర్ పేరు పెట్టడమే ఆమనకు మనం ఇచ్చే గౌరవమని ఈసందర్భంగా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొంటూ పార్లమెంట్‌ భవనానికి అంబేద్కర్‌ పేరు పెట్టాలంటూ సెప్టెంబర్ 13వ తేదీన ఆయన అసెంబ్లీలో తీర్మానం కూడా ప్రవేశపెట్టారు. తెలంగాణ శాసనసభ తీర్మానం చేసిన మరుసటి రోజే బండి సంజయ్ కూడా పార్లమెంటు భవనానికి డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ పేరు పెట్టే అంశాన్ని పరిశీలించాలని కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తిచేయడం గమనర్హం.