సామాన్యుడిపై మరో పిడుగు..రెండు రోజుల్లో నిత్యావసర ధరలు భారీగా పెరగనున్నాయి

ఇప్పటికే భారీగా పెరిగిన నిత్యావసర ధరలతో సామాన్య ప్రజలు అల్లాడిపోతుంటే..మరో రెండు రోజుల్లో మరింతగా పెరగబోతున్నాయి. తాజాగా జీఎస్టీ మండలిలో తీసుకున్న నిర్ణయం మేరకు ఈనెల 18 నుంచి మరికొన్ని నిత్యావసర వస్తువుల ధరలు పెరగనున్నాయి. ప్యాక్‌ చేసిన పెరుగు, మజ్జిగ, లస్సీ, పన్నీర్‌ తదితరాలపై 5 శాతం జీఎస్టీ విధించనున్నారు. ఆయా వస్తువులపై ఇంతకుముందు ఇన్‌పుట్‌ టాక్స్‌ ప్రయోజనం ఉండగా, ఇప్పుడు తొలగించనున్నారు.

ప్యాక్‌ చేసిన బియ్యం, గోధుమలు, పిండిపై కూడా ఇన్‌పుట్‌ టాక్స్‌ ప్రయోజనం దూరం కానుండటం వల్ల వాటి ధరలు భారీగా పెరగనున్నాయి. ఇవి మాత్రమే కాదు ఎల్‌ఈడీ లైట్లు, ఐసీయూలు మినహా ఆసుపత్రుల్లో 5వేల రూపాయలకు మించిన గది అద్దె, రోజుకు వెయ్యిలోపు ఉండే హోటల్‌ గది అద్దె వంటివి కూడా పెరగనున్నాయి. ఇప్పటీకే పెరిగిన వాటి ధరలు తగ్గించాలని ప్రజలు , రాజకీయ పార్టీలు రోడ్డెక్కి ధరలు, ఆందోళనలు చేస్తుంటే..ఇప్పుడు మరింతగా పెరిగితే కేంద్రం ఫై వారి ఆగ్రహం కట్టలు తెచ్చుకోవడం ఖాయం.