జమ్మూ కశ్మీర్‌లో రోడ్డు ప్రమాద బాధితులకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా

11-passes-away-25-injured-in-minibus-accident-in-j-k’s-poonch

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్ పూంచ్‌లోని సావ్జియాన్ ప్రాంతంలో ప్రయాణికులతో వెళ్తున్న మినీ బస్సుకు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అయితే పూంచ్‌లో జరిగిన మినీ బస్ ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, జమ్మూ కశ్మీర్ లెఫ్ట్నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మరణించిన వారికి రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటిస్తున్నట్టుస్పష్టం చేశారు.

కాగా, ఈ మినీ బస్సు ప్రమాదంలో 11 మంది మృతి చెందగా, 25 మందికి గాయాలయ్యాయి. ఈ ప్రమాద సమయంలో మినీ బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులన్నట్టు తెలుస్తోంది. గాయపడ్డ ప్రమాద బాధితులను మండిలోని ఆసుపత్రికి తరలిస్తున్నారు. మిగతా వారిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నట్టు అధికారులు చెబుతున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/