టీడీపీ మహానాడు అట్టర్ ప్లాప్‌ -మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ

టీడీపీ మహానాడు అట్టర్ ప్లాప్‌ అయ్యిందన్నారు వైస్సార్సీపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. నంద్యాలలో ప్రారంభమైన ఆదివారం నాటి సామాజిక న్యాయభేరీ బస్సు యాత్ర.. మధ్యాహ్నానికి కర్నూలుకు చేరుకుంది. పాణ్యం మీదుగా కర్నూలు సి క్యాంప్‌కు బస్సు యాత్ర చేరుకుంది. కర్నూలులో బస్సుయాత్రకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. సాయంత్రం అనంతపురం కు చేరుకుంది. ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.

ఈ భారీ సభలో మరోసారి మంత్రులు టీడీపీ ఫై ఓ రేంజ్ లో విరుచుకపడ్డారు. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ సభ లో మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనలో టీడీపీ కార్యకర్తలకే సంక్షేమ పథకాలు అందాయని.. వైఎస్‌ జగన్ పాలనలో కులాలు, పార్టీ లకు అతీతంగా సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. బీసీలను చంద్రబాబు ఓటు బ్యాంకుగానే చేసారని , మహానాడు అట్టర్ ఫ్లాప్ అయ్యిందన్నారు. ‘‘సీఎం జగన్‌ను ఎందుకు క్విట్ చేయాలి?. అమ్మ ఒడి ఇస్తున్నందుకా?. రైతు భరోసా ఇస్తున్నందుకా?. వైఎస్సార్ చేయూత ఇస్తున్నందుకా?’’ అని మంత్రి ప్రశ్నించారు. జగనన్న ముద్దు.. చంద్రబాబు వద్దు అన్న నినాదంతో ముందుకెళ్లాలని’’ పిలుపునిచ్చారు.