కరీంనగర్ జైలు నుండి విడుదలైన బండి సంజయ్

పదో తరగతి పేపర్ లీక్ కేసులో అరెస్ట్ అయినా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ..కరీంనగర్ జైలు నుండి విడుదలయ్యారు. పదో తరగతి ప్రశ్నపత్రం లీక్ కేసులో బండి సంజయ్‌ని మంగళవారం రాత్రి అరెస్ట్ చేసిన పోలీసులు.. బుధవారం ఆయన్ను కోర్టు ఎదుట హాజరుపర్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి సంజయ్ కి హన్మకొండ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో పోలీసులు ఆయన్ను బుధవారం రాత్రే కరీంనగర్ జైలుకు తరలించారు. అయితే, ఈ కేసులో గురువారం సుదీర్ఘ వాదనల అనంతరం కోర్టు బండి సంజయ్‌కి బెయిల్ మంజూరు చేసింది.

కొద్ది సేప‌టి క్రిత‌మే న్యాయ‌వాదులు క‌రీంన‌గ‌ర్ జిల్లా కారాగారానికి చేరుకొని బెయిల్ ప‌త్రాల‌ను జైల్ అధికారుల‌కు అంద‌జేశారు. న్యావాదులు అంద‌జేసిన ప‌త్రాల‌ను జిల్లా జైయిల్ అధికారులు పరిశీలించి..సంజయ్ ని విడుదల చేసారు. దేశం విడిచి వెళ్ల‌వ‌ద్ద‌ని, కేసుకు పూర్తిగా స‌హ‌క‌రించాల‌ని కోర్టు ష‌ర‌తులు విధించింది. ష‌ర‌తుల‌ను బండి సంజ‌య్ త‌ర‌పు న్యాయ‌వాదులు అంగీక‌రించారు. ఇక ఉదయం నుండి జైలు వద్దకు భారీగా బిజెపి కార్యకర్తలు చేరుకున్నారు. బండి సంజయ్ బయటకు రాగానే అంత సంబరాల్లో మునిగిపోయారు.