ఈనెల 6వ తేదీన బండి సంజయ్ నామినేషన్

తెలంగాణ లో ఈరోజు నుండి అసెంబ్లీ ఎన్నికలకు సంబదించిన నామినేషన్ల ప్రక్రియ మొదలుకాబోతుంది. ఈరోజు నుండి ఈ నెల 10 వరకు నామినేషన్ లను స్వీకరిస్తారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 వరకు ఈ ప్రక్రియ జరుగుతుంది. నామినేషన్ల దాఖలు సమయంలో ఆర్‌వో కార్యాలయం 100 మీటర్ల పరిధిలోకి 3 వాహనాలకే అనుమతించనున్నట్లు అధికారులు తెలిపారు.

అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ముహుర్తాలు చూసుకొని నామినేషన్ వేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ క్రమంలో ఈనెల 6వ తేదీన నామినేషన్ దాఖలు చేయబోతున్నట్లు బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్ తెలిపారు. ఆయన కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటె నిన్న బిజెపి మూడో విడత అభ్యర్థుల లిస్ట్ ను విడుదల చేసింది. ఆ వివరాలు చూస్తే..

బోధన్‌ – వడ్డి మోహన్‌రెడ్డి
మంచిర్యాల- వీరబెల్లి రఘునాథ్‌
ఆసిఫాబాద్‌ (ఎస్టీ) – అజ్మీరా ఆత్మారాం నాయక్‌
బాన్సువాడ – యెండల లక్ష్మీనారాయణ
నిజామాబాద్‌ రూరల్‌ – దినేశ్‌ కులాచారి
మంథని – చందుపట్ల సునీల్‌రెడ్డి
అందోల్‌ (ఎస్సీ)- పల్లి బాబూమోహన్‌
జహీరాబాద్‌ (ఎస్సీ) – రామచంద్ర రాజ నరసింహా
మెదక్‌ – పంజా విజయ్‌కుమార్‌
నారాయణ్‌ఖేడ్‌ – జనవాడె సంగప్ప
ఉప్పల్‌ – ఎన్‌వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌
ఎల్బీనగర్‌ – సామ రంగారెడ్డి
రాజేంద్రనగర్‌ – తోకల శ్రీనివాస్‌రెడ్డి
మలక్‌పేట్‌ – శ్యామ్‌రెడ్డి సురేందర్‌రెడ్డి
అంబర్‌పేట – కృష్ణ యాదవ్‌
జూబ్లీహిల్స్‌ – లంకల దీపక్‌ రెడ్డి
సనత్‌నగర్‌ – మర్రి శశిధర్‌రెడ్డి
సికింద్రాబాద్‌ – మేకల సారంగపాణి
చేవెళ్ల (ఎస్సీ) – కేఎస్‌ రత్నం
పరిగి – బోనేటి మారుతి కిరణ్‌
ముషీరాబాద్‌ – పోస రాజు
పరకాల – కాలి ప్రసాద్‌రావు
పినపాక (ఎస్టీ) – పొడియం బాలరాజు
పాలేరు – నున్న రవికుమార్‌
సత్తుపల్లి (ఎస్సీ)- రామలింగేశ్వరరావు
నారాయణ్‌పేట్‌ – రతంగ్‌ పాండురెడ్డి
జడ్చర్ల – చిత్తరంజన్‌ దాస్‌
మక్తల్‌ – జలంధర్‌రెడ్డి
వనపర్తి – అశ్వత్థామరెడ్డి
అచ్చంపేట (ఎస్సీ)- దేవని సతీశ్‌ మాదిగ
షాద్‌నగర్‌ – అండె బాబయ్య
దేవరకొండ (ఎస్టీ)- కేతావత్‌ లాలూ నాయక్‌
హుజూర్‌నగర్‌ – చల్ల శ్రీలతారెడ్డి
నల్గొండ- మాదగాని శ్రీనివాస్‌గౌడ్‌
ఆలేరు – పడాల శ్రీనివాస్‌