ఈరోజు LV ప్రసాద్ హాస్పటల్ లో చంద్రబాబుకు కంటి ఆపరేషన్

chandra-babu-Naidu
chandra-babu-Naidu

హైదరాబాద్ లోని LV ప్రసాద్ హాస్పటల్ లో ఈరోజు చంద్రబాబు కు కంటి ఆపరేషన్ చేయనున్నారు. గురువారం AIG హాస్పటల్ లో ..ఆయనకు బ్లడ్, యూరిన్, ఈసీజీ, 2డి ఎకో, కాలేయం – మూత్రపిండాల పనితీరు, అలర్జీ స్క్రీనింగ్, గుండె సంబంధిత టెస్టులు చేసారు. జనరల్ మెడిసిన్, కార్డియాలజీ, పల్మనాలజీ, డెర్మటాలజీ నిపుణుల సూచనల మేరకు అడ్మిట్ అయి చికిత్స తీసుకున్నారు.

ఈరోజు జూబ్లీహిల్స్ లోని LV ప్రసాద్ హాస్పిటల్ లో ఆయనకు కంటికి ఆపరేషన్ చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టయి 50రోజులకు పైగా రాజమహేంద్రవరం జైలు లో ఉన్న బాబు..మంగళవారం బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఆయనకు అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు వైద్య పరీక్షల కోసం హైదరాబాద్ వచ్చారు. తిరిగి నవంబర్ 28 న సరెండర్ అవ్వాల్సి ఉంది.