ఓటుతో బిఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులకు బుద్ది చెప్పండిః బండి సంజయ్ పిలుపు

bandi-sanjay-in-karimnagar

హైదరాబాద్‌ః ఒక్క ఓటుకు రూ.10 వేలు గంగుల ఇస్తున్నాడని బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు చేశారు. కరీంనగర్ లోని కమాన్ పూర్ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన బండి సంజయ్..ఈ సందర్భంగా మాట్లాడారు. భూకబ్జాలు తప్ప మీకేం తెలుసు? ప్రజల కోసం ఎన్నడైనా పోరాడి జైలుకుపోయారా? కరీంనగర్ పై పూర్తి అవగాహనే లేని వ్యక్తి కాంగ్రెస్ అభ్యర్ధి అంటూ ఫైర్‌ అయ్యారు.

లక్ష ఫోన్లు, ఓటుకు రూ.10 వేలును గంగుల నమ్ముకున్నాడు…మీ సమస్యలపై పోరాడి జైలుకు పోయిన చరిత్ర నాదన్నారు. మీరు ఓట్లు వేయకుంటే పేదల పక్షాన పోరాడేవాళ్లు వెనుకంజ వేస్తారు…గంగుల లక్ష సెల్ ఫోన్ల, ఓటుకు రూ.10 వేలను నమ్ముకున్నాడని నిప్పులు చెరిగారు. ఓటుతో బిఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులకు బుద్ది చెప్పండని బిజెపి సంజయ్ పిలుపు నిచ్చారు. కరీంనగర్ వచ్చి అభివృద్ధి గురించి సిఎం కెసిఆర్ ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు.