ఎంపీ కాక ముందే నేను పోరాటాలు చేస్తూ.. ఐదు సార్లు జైలుకు వెళ్లానుః బండి సంజయ్‌

bandi-sanjay-election-campaign-at-karimnagar

హైదరాబాద్ ః హామీలు నెరవేర్చడంలో బిజెపి ఎప్పుడూ విఫలం కాలేదని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ, కరీంనగర్ ఎమ్మెల్యే అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్​లో నిర్వహించిన పద్మశాలీ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ..కెసిఆర్​పై, బిఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు. బిఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు వివక్షకు గురయ్యారని ఆరోపించారు. కెసిఆర్ పాలనలో కేవలం ఆయన కుటుంబం మాత్రమే బాగుపడిందని అన్నారు.

“ఎంపీ కాక ముందే నేను పోరాటాలు చేస్తూ ఐదు సార్లు జైలుకు వెళ్లాను. బిజెపి కార్యకర్తపై దాడి జరిగితే అనేక సార్లు పోరాటం చేశాను. బిఆర్ఎస్ పాలనలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రజా పాలన రావాలంటే రాష్ట్రంలో బిజెపినే అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది. కెసిఆర్ నిరంకుశ పాలనకు ఇక చరమగీతం పాడేద్దాం. రాష్ట్రంలో రామ రాజ్యం తీసుకువద్దాం. అలా జరగాలంటే మీరు ఈనెల 30వ తేదీన జరగబోయే పోలింగ్​లో కమలం గుర్తుకు ఓటు వేయాలి. బిజెపిని తెలంగాణ గడ్డపై గెలిపించాలి” అని బండి సంజయ్ కోరారు.