ఫిషింగ్ హార్బర్ అగ్నిప్రమాదం..జనసేన పార్టీ తరఫున రూ.50 వేల చొప్పున ఇస్తాంః పవన్ ప్రకటన

60కి పైగా బోట్లు దగ్ధమయ్యాయన్న పవన్ కల్యాణ్

Fishing harbour fire..statement on behalf of Janasena party Rs.50 thousand

అమరావతిః విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ లో ఆదివారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం జరిగి పెద్ద సంఖ్యలో బోట్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. ఈ ప్రమాదంలో కోట్లాది రూపాయల ఆస్తినష్టం జరిగినట్టు అంచనా. ఈ ఘటనపై జనసేనాని పవన్ కల్యాణ్ స్పందించారు. విశాఖ హార్బర్ లో జరిగిన అగ్నిప్రమాదంలో 60కి పైగా బోట్లు దగ్ధమయ్యాయని వెల్లడించారు. బోట్లు కాలిపోయి నష్టపోయిన యజమానులకు, వారి కుటుంబాలకు జనసేన పార్టీ తరఫున రూ.50 వేలు చొప్పున ఆర్థిక సాయం అందజేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. వచ్చే రెండు మూడు రోజుల్లో తానే స్వయంగా వచ్చి బాధితులకు సాయం అందిస్తానని పవన్ వివరించారు. బోట్లు నష్టపోయిన వారి కుటుంబాలకు జనసేన అండగా ఉంటుందని పేర్కొన్నారు.