రాష్ట్రంలో మరిన్ని ఉప ఎన్నికలు రాబోతున్నాయిః బండి సంజయ్‌

bandi-sanjay-comments-on-by-elections-in-telangana

హైదరాబాద్‌ః బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ ప్రజా సంగ్రామ యాత్ర మూడో రోజూ కొనసాగుతోంది. గొల్లగూడెం, ముగ్దుమ్‌పల్లి, గుర్రాలదండి, బట్టుగూడెం గ్రామాల మీదుగా 11.7 కి.మీ.మేర నేడు పాదయాత్ర సాగనుంది. ఈ క్రమంలోనే భువనగిరి పట్టణంలోని జిట్టా బాలకృష్ణా రెడ్డి ఫామ్​హౌస్​లో బండి సంజయ్ మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో రానున్నది బిజెపి ప్రభుత్వమేనని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వంలో జర్నలిస్టులకు రైల్వే పాసులు, ఇళ్లు నిర్మించి ఇస్తామని తెలిపారు. పాత్రికేయులను ఆదుకునే బాధ్యత తమదే అని.. ఆయుష్మాన్ భారత్​లో జర్నలిస్టులను చేర్చే విషయం చర్చిస్తానని చెప్పారు.

తెలంగాణలో ఇప్పటి వరకు నాలుగు ఉప ఎన్నికల్లో రెండు గెలిచామని బండి సంజయ్ గుర్తు చేశారు. మునుగోడు ఎన్నిక తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును నిర్మించే ఎన్నికలని వ్యాఖ్యానించారు. తమతో 10, 12 మంది ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారని.. రాష్ట్రంలో ఇంకా చాలా ప్రాంతాల్లో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని బండి పేర్కొన్నారు. టిఆర్‌ఎస్‌ నాయకులే ఉప ఎన్నికలకు కారణం కాబోతున్నారని అన్నారు. ఈ క్రమంలోనే కోమటిరెడ్డి బ్రదర్స్ చాలా సందర్భాల్లో మోడీ పథకాలను ప్రశంసించారని ఆయన తెలిపారు.డ

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/