హైకోర్టు న్యాయమూర్తులుగా ఏడుగురు కొత్త జడ్జిలు ప్రమాణం

Swearing-in-Ceremony of Judges and Adl. Judges of the High Court of AP at Tummalapalli Kalakshetram

అమరావతిః నేడు ఏపి హైకోర్టుకు నియమితులైన ఏడుగురు న్యాయమూర్తులు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ వీరిచే ప్రమాణ స్వీకారం చేయించారు. ముందుగా న్యాయమూర్తులుగా అడుసుమల్లి వెంకట రవీంద్రబాబు, డాక్టర్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్, బండారు శ్యాంసుందర్, ఊటుకూరు శ్రీనివాస్ ప్రమాణం చేశారు.

అదనపు జడ్జిలుగా బొప్పన వరాహ లక్ష్మీనరసింహ చక్రవర్తి, తల్లాప్రగడ మల్లికార్జునరావు , దుప్పల వెంకటరమణతో ప్రమాణం చేయించారు. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర మాతృమూర్తి కన్నుమూసిన కారణంగా సీజే ప్రమాణం చేయించే కార్యక్రమానికి హాజరుకాలేకపోయారు. దీంతో గవర్నర్‌ నూతన జడ్జిలచే ప్రమాణం చేయించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/