శాకుంతలం విడుదల సందర్బంగా విజయ్ దేవరకొండ ప్రత్యేక నోట్

శాకుంతలం విడుదల సందర్బంగా విజయ్ దేవరకొండ ప్రత్యేక నోట్ ను సోషల్ మీడియా లో షేర్ చేసారు. బాల రామాయణం , చూడాలని వుంది, ఒక్కడు , రుద్రమదేవి వంటి సూపర్ హిట్ చిత్రాలను డైరెక్షన్ చేసిన గుణ శేఖ‌ర్..పౌరాణిక ప్రేమ గాథ. కాళిదాసు ర‌చించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా శాకుంతలం మూవీ తెరకెక్కించారు. దుష్యంతుడిగా మ‌ల‌యాళ న‌టుడు దేవ్ మోహ‌న్‌, శ‌కుంత‌ల‌గా స‌మంత న‌టించారు. గుణ శేఖర్ మేకింగ్, టేకింగ్‌కి స‌మంత క్రేజ్‌తో పాటు ఈ సినిమా నిర్మాణంలో దిల్ రాజు కూడా పార్ట్ అయ్యారు. దీంతో సినిమాపై హైప్ పెరిగింది. దానికి తోడు టీజ‌ర్‌, ట్రైల‌ర్‌లోని విజువ‌ల్స్ ఈ ఆస‌క్తిని మ‌రింత‌గా పెంచేశాయి. భారీ అంచనాల మధ్య ఈరోజు (ఏప్రిల్ 14) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ సందర్బంగా విజయ్ దేవరకొండ ..తన ట్విట్టర్ లో ప్రత్యేక నోట్ ను పోస్ట్ చేసి, సమంత ఫై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ‘సామీ, నువ్వు ప్రేమమూర్తివి. ఎప్పుడూ పర్ఫెక్ట్‌గా చేయాలని కోరుకుంటావు. అందరికీ ఉత్సాహాన్ని పంచుతావు. ఇప్పటికీ నువ్వు ఏ సినిమా చేసినా దానిపైనే నీ కెరీర్ మొత్తం ఆధారపడినట్లుగా ప్రతి షాట్‌కు వంద శాతం కష్టపడతావు. శరీరానికి విశ్రాంతి అవసరం అయినప్పటికీ నీ సినిమాలు, అభిమానుల కోసం ఎప్పుడూ చిరునవ్వుతో, సరైన దిశలో అడుగులు వేయడానికి ప్రయత్నిస్తున్నావు. ఏడాది కాలంగా యోధురాలిగా ఎలా పోరాడుతున్నావో ఈ ప్రపంచానికి ఎప్పటికీ తెలియకపోవచ్చు’ అని నోట్‌లో పేర్కొన్న విజయ్.. సమంత ‘శాకుంతలం’ మూవీ కోసం ఆల్ ది బెస్ట్ చెప్పాడు. సంకల్పంతో పాటు లక్షలాది అభిమానుల ప్రేమే తనను సేఫ్‌గా ఉంచుతాయని ఆకాంక్షించాడు విజయ్.

ప్రస్తుతం సమంత, విజయ్ దేవరకొండ జంటగా శివ నిర్వాణ డైరెక్షన్లో ‘ఖుషి’ మూవీ చేస్తున్నారు. ఒక మిలటరీ ఆఫీసర్, కశ్మీరీ అమ్మాయి మధ్య లవ్ స్టోరీ నేపథ్యంలో ఈ కథ ఉండనుందని తెలుస్తోంది. కాగా.. ఈ చిత్రంలో జయ రామ్, సచిన్ ఖడేకర్ వంటి సీనియర్ యాక్టర్స్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.