బిగ్ బాస్ 5 : రెండు వారాలకు ఉమాదేవి గట్టిగానే రెమ్యూనరేషన్ అందుకుంది

బిగ్ బాస్ 5 : రెండు వారాలకు ఉమాదేవి గట్టిగానే రెమ్యూనరేషన్ అందుకుంది

బిగ్ బాస్ 5 సక్సెస్ ఫుల్ గా రెండు వారాలు పూర్తి చేసుకుంది. అంత అనుకున్నట్లే ఈ వారం హౌస్ నుండి ఉమాదేవి ఎలిమినేషన్ అయ్యింది. తొలి నుంచి చాలా అగ్రిసివ్‌గా ఉన్న ఉమ.. నామినేషన్స్ సందర్భంగా తిట్టిన బూతు చాలామందికి ఇబ్బందిగా అనిపించింది. అదే ఆమెను ఎలిమినేషన్ అయ్యేలా చేసింది. లోబోతో కామెడీ చేస్తూ ఎంటర్‌టైన్‌ చేస్తున్నా నామినేషన్‌ ప్రక్రియలో బూతులు మాట్లాడకపోయి ఉంటే మరొకొన్ని రోజులు ఆమె బిగ్‌బాస్‌లో కంటిన్యూ అయ్యేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటె ఈమె రెండు వారాలకు గాను గట్టిగానే రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది. బిగ్‌బాస్ కంటెస్టెంట్లకు వారం చొప్పున పారితోషికాన్ని చెల్లిస్తారు. ఆ లెక్కన రెండు వారాలకు గాను ఆమెకు సుమారు రూ. లక్షా అరవై వేల పారితోషికం అందినట్లు సమాచారం.

ప్రస్తుతం హౌస్ లో 17 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. వీరిలో నుంచి ఒకరిని హౌస్‌ నుంచి బయటకు పంపేందుకు ఈరోజు ఎపిసోడ్‌లో నామినేషన్స్‌ జరగనున్నాయి. నామినేషన్స్‌ మొదలవగాఏ కంటెస్టెంట్లు ఒకరి మీద ఒకరు ఫైర్‌ అవుతూ, దూషించుకోవడం మొదలు పెట్టినట్లు ప్రోమో లో చూపించారు.