రేపటి నుంచి బండి సంజయ్ ఐదో విడుత ప్రజా సంగ్రామ యాత్ర

రేపటి నుంచి బండి సంజయ్ ఐదో విడుత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభం కాబోతుంది. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నాల్గు విడతల్లో రాష్ట్రంలోని పలు ఏరియాల్లో పాదయాత్ర చేపట్టిన సంజయ్..ఇప్పుడు ఐదో విడుత యాత్రకు సిద్ధమయ్యారు. రేపటి నుండి ప్రజా సంగ్రామ యాత్ర చేయనున్నారు. దీంతో బీజేపీ శ్రేణులు పాదయాత్రకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు నియోజకవర్గాల్లో 10 రోజుల పాటు 114 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు. కాగా భైంసాలో ప్రారంభ సభకు మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ హాజరుకానున్నారు.

ఇక తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు జరిగిన గోల్కొండ కిల్లా పై కాషాయ జండా ఎగుర వేస్తం అని బండి సంజయ్ అన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి అంటే సీఎం కుటుంబానికి కమిషన్ ఇవ్వాలి .. భాగ స్వామ్యం ఇవ్వాలి. కెసిఆర్ ఏ రోజు రాష్ట్రానికి లాభం జరగాలి అని ఆలోచించడు. గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వడం లేదన్నారు. కేంద్ర నిధులు దారి మల్లిస్తున్నాడు. పది లక్షల ఉద్యోగాలు ఇచ్చేందుకు ముందుకు సాగుతుంది మోడీ ప్రభుత్వం. కేంద్రం ఉద్యోగాలు ఇస్తుంటే… ఈ ప్రభుత్వం ఉద్యోగాలు తొలగిస్తుంది అని మండిపడ్డారు. ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు… ప్రమోషన్ లు ఇవ్వకుండా రివర్సన్ లు ఇస్తున్నాడంటూ ఫైర్ అయ్యారు.