ప్రారంభమైన లోకేశ్‌ “యువగళం” పాదయాత్ర

వరదరాజ స్వామి ఆలయంలో ప్రార్థనలు నిర్వహించిన లోకేశ్, బాలయ్య

nara-lokesh-yuvagalam-padayatra-starts-from-kuppam

కుప్పం: టిడిపి యువనేత, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రారంభమయింది. అంతకు ముందు కుప్పం సమీపంలో ఉన్న లక్ష్మీపురంలో శ్రీవరదరాజ స్వామి ఆలయంలో తన మామయ్య బాలకృష్ణతో కలిసి లోకేశ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం సరిగ్గా 11.03 గంటలకు పాదయాత్రను ప్రారంభించారు. ఆయనతో పాటు బాలకృష్ణ, పలువురు టిడిపి కీలక నేతలు, వేలాది మంది పార్టీ కార్యకర్తలు నడుస్తున్నారు. 400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్ల మేర కొనసాగనున్న ఈ సుదీర్ఘ పాదయాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగియనుంది.

మరోవైపు లోకేశ్‌కు తెలుగు మహిళలు తిలకం దిద్ది, అభినందనలు తెలియజేశారు. యాత్ర నిర్విఘ్నంగా కొనసాగాలని ఆకాంక్షించారు.తొలి రోజున ఆయన పాదయాత్ర 8.5 కిలో మీటర్ల మేర కొనసాగనుంది.

కాగా, లోకేశ్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. ‘కుప్పం తెలుగుదేశం కుటుంబం ఆత్మీయ స్వాగ‌తానికి ధ‌న్య‌వాదాలు. త‌ర‌గ‌ని మీ అభిమానాన్ని పొందిన నేను అదృష్ట‌వంతుడిని. మీ ఆశీస్సుల‌తో యువగళం పాదయాత్ర మొద‌ల‌వ‌బోతోంది. పాద‌యాత్ర ప్రారంభానికి త‌ర‌లివ‌చ్చిన తెలుగుదేశం పార్టీ పెద్ద‌లు, నేత‌లు, అభిమానులంద‌రికీ పేరు పేరునా కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నాను’ అని అన్నారు.

ఈ నాటి పాదయాత్ర షెడ్యూల్: 

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/category/andhra-pradesh/