మెగా హీరో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు బాలకృష్ణ గెస్ట్

ఒకప్పుడు మెగా , నందమూరి అభిమానుల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేది..కానీ ఇప్పుడు ఆలా కాదు మెగా, నందమూరి అభిమానులు ఇద్దరు ఒక్కటే. ఈ ఇరువురు ఫ్యామిలీ నుండి ఏ హీరో సినిమా వచ్చిన ఇరువురు సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. రీసెంట్ గా ఆర్ఆర్ఆర్ మూవీ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించారు..ప్రస్తుతం అల్లు అరవింద్ నిర్మాణంలో నడుస్తున్న ఆహా లో బాలకృష్ణ హోస్ట్ గా ఓ షో చేస్తున్నారు. ఇక ఇప్పుడు మెగా హీరో అల్లు శిరీష్ నటించిన చిత్ర ప్రీ రిలీజ్ కు బాలకృష్ణ చీఫ్ గెస్ట్ గా హాజరు కాబోతున్నారు.

అల్లు శిరీష్ హీరోగా నటించిన ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమా నవంబరు 4న థియేటర్లలోకి రాబోతుంది. ఈ క్రమంలో మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌ని హైదరాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్ హాల్‌లో ఆదివారం (రేపు) నిర్వహించబోతున్నారు. ఈ ఈవెంట్‌కి బాలకృష్ణ రాబోతున్నట్లు టీమ్ యూనిట్ ప్రకటించింది. జీఏ2 పిక్చర్స్‌ బ్యానర్‌పై ఈ సినిమా వస్తుండగా.. రాకేశ్ శశి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ తాలూకా సాంగ్స్ , టీజర్ ఆకట్టుకున్నాయి. గత కొంతకాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న శిరీష్..ఈ మూవీ ఫై భారీ ఆశలే పెట్టుకున్నాడు.