ఢిల్లీలో భారీ అగ్నిప్ర‌మాదం

ఢిల్లీలో భారీ అగ్నిప్ర‌మాదం
fire-accident-in-delhi

న్యూఢిల్లీ: ఢిల్లీలో భారీ అగ్ని ప్ర‌మాదం సంభ‌వించింది. రోహిణి ప్రాంతంలోని షాబాద్ డెయిరీ స‌మీపంలో బుధ‌వారం అర్ధ‌రాత్రి మంట‌లు ఒక్క‌సారిగా ఎగ‌సిప‌డ్డాయి. దీంతో స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. 20 ఫైర్ ఇంజన్ల‌తో మంట‌ల‌ను ఆర్ప‌‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారు. మొదట ఆరు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. దీంతో మరికొన్ని ఫైర్ ఇంజన్లు తీసుకువచ్చి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే ప్ర‌మాదానికి సంబంధించిన కార‌ణాలు ఇంకా తెలియ‌లేద‌ని డిప్యూటీ చీఫ్ ఫైర్ ఆఫీస‌ర్ ధ‌ర‌మ్‌పాల్ భ‌ర‌ద్వాజ్ తెలిపారు. ఈ ఘ‌ట‌న‌లో ఇప్ప‌టివ‌ర‌కు ఎవ‌రూ మ‌ర‌ణించ‌లేద‌ని వెల్ల‌డించారు. మంట‌లు ప్ర‌స్తుతం అదుపులోకి వ‌చ్చాయ‌ని చెప్పారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/