పవన్ కు ఓపెన్ ఛాలెంజ్ చేసిన వెల్లంపల్లి శ్రీనివాస్..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. పవన్ కళ్యాణ్ పశ్చిమ నియోజకవర్గంపై సమీక్ష చేయడం కాదు.. దమ్ముంటే తన పై పోటీచేయాలని సవాల్ విసిరారు. ఇలా చేస్తే, పవన్ సత్తా ఏంటో.. తన దమ్ము ఏంటో తేలిపోతుందన్నారు. రేపు ఆదివారం కాబట్టి వీకెండ్ హాలిడే కోసం ఏపీకి వచ్చి వెళ్లడం కాదని.. దమ్ముంటే తన సవాల్‌ను స్వీకరించి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేయాలని వెల్లంపల్లి సవాల్ విసిరారు. శనివారం పశ్చిమ నియోజకవర్గం 47వ డివిజన్‌లో ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ కు శ్రీనివాస్ ఛాలెంజ్ విసిరారు. మరి ఈ ఛాలెంజ్ పట్ల పవన్ కళ్యాణ్ స్పందిస్తారా లేదా అనేది చూడాలి.

ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు వాడి వేడిగా నడుస్తున్నాయి. గతంలో టీడీపీ ని టార్గెట్ గా పెట్టుకున్న వైస్సార్సీపీ..ప్రస్తుతం జనసేన ను టార్గెట్ గా పెట్టుకుంది. రీసెంట్ గా విశాఖ లో పవన్ కళ్యాణ్ పర్యటనను అడ్డుకోవడం , ఎయిర్ పోర్ట్ లో తమపై దాడి చేసారని కొంతమంది జనసేన కార్య కర్తలపై కేసులు పెట్టడం వంటివి చేసారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ వైస్సార్సీపీ నేతలను నా కొడకల్లారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేయడం..దానికి వైస్సార్సీపీ నేతలు కౌంటర్లు ఇవ్వడం జరిగింది. మొత్తం మీద ఏపీలో జనసేన vs వైస్సార్సీపీ వార్ నడుస్తుంది.