‘టర్కీ’ కి వెళ్లబోతున్న నందమూరి బాలయ్య

రీసెంట్ గా కరోనా నుండి క్షేమంగా బయటపడ్డ నందమూరి బాలకృష్ణ..మళ్లీ సినిమా షూటింగ్లలో బిజీ అయ్యారు. ప్రస్తుతం ఈయన గోపీచంద్ మలినేని డైరెక్షన్లో తన 107 వ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ ట్రైలర్ సినిమా ఫై అంచనాలను రెట్టింపు చేసింది. ఇక ఈ మూవీ షూటింగ్ మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా ఎక్కడా పెద్దగా గ్యాప్ లేకుండా పూర్తి చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా చాలా వరకూ చిత్రీకరణను పూర్తి చేసుకుంది.

ఇక ఈ సినిమాకి సంబంధించిన కొంత షూటింగును అమెరికాలో జరపాలని ప్లాన్ చేసారు. కానీ కొన్ని కారణాల వలన అది కుదరకపోవడంతో ‘టర్కీ’లో ప్లాన్ చేసారు. త్వరలోనే ఈ సినిమా టీమ్ అక్కడికి బయల్దేరనున్నట్టు సమాచారం. కొన్ని సన్నివేశాలతో పాటు ఒకటి రెండు పాటలను కూడా అక్కడ చిత్రీకరించే అవకాశం ఉంది. ఇక ఈ మూవీ లో బాలకృష్ణ కు జోడిగా శ్రుతి హాసన్ నటిస్తుండగా, ప్రతినాయకుడిగా కన్నడ నటుడు దునియా విజయ్ కనిపించనున్నాడు. ‘అఖండ’ సినిమా విజయంలో కీలకమైన పాత్రను పోషించిన తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ‘దసరా’కి ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఉన్నారు.