పొన్నియిన్‌ సెల్వన్‌ నుండి ఐశ్వర్యరాయ్ లుక్ రిలీజ్

ఏస్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న ప్రెస్టీజియస్‌ చిత్రం పొన్నియిన్‌ సెల్వన్‌. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ రెండు భాగాలుగా విడుదల కానుంది. PS1 సెప్టెంబర్‌ 30న తమిళ్‌, హిందీ, తెలుగు, కన్నడ, మలయాళంలో భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్ ఫై దృష్టి సారించారు.

రీసెంట్ గా సోమవారం విక్రమ్ తాలూకా ఫస్ట్ లుక్ విడుదల చేసి మెప్పించారు. ఈ మూవీ లో విక్ర‌మ్ ‘ఆదిత్య క‌రికాల‌న్’ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. చోళ కిరీట యువ‌రాజు అంటూ మేక‌ర్స్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ పోస్ట‌ర్‌లో విక్ర‌మ్ గుర్రంపై కూర్చొని క‌ళ్ల‌లో తేజ‌స్సు, చిన్న‌ చిరున‌వ్వు చిందిస్తూ.. రాజ‌సం ఉట్టిప‌డేలా ఉన్నాడు. మంగళవారం కార్తీ పోషిస్తున్న వందియ దేవన్‌ పాత్రను విడుదల చేశారు. ఈ రెండు పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తూ చిత్రంపై ఆసక్తిని రేకెతిస్తోంది.

ఇక ఈరోజు ఐశ్వర్యరాయ్ తాలూకా లుక్ విడుదల చేసారు. ఈ సినిమాలో ఐశ్వర్యరాయ్ కీలకమైన పాత్రలో నటిస్తుంది. రీ ఎంట్రీ తరువాత ఆమె చేసిన భారీ సినిమా ఇది. ఈ సినిమాలో ‘నందిని’ అనే పాత్రను పోషించిందనే విషయాన్ని తెలియజేస్తూ ఆమె లుక్ ను రిలీజ్ చేశారు. ఐశ్వర్య రాయ్ అదే గ్లామర్ తో ఆకట్టుకుంటూ ఉండటం విశేషం. ఇక ఈ మూవీ లో విక్రమ్‌, జయం రవి, కార్తి, ఐశ్వర్య రాయ్‌ బచ్చన్‌, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శరత్‌కుమార్‌, విక్రమ్‌ ప్రభు, శోభిత ధూళిపాళ, జయరామ్‌, ప్రభు, పార్తిబన్‌, ప్రకాష్‌రాజ్‌ కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా ఇది. 1950ల్లో విడుదలై సెన్సేషనల్‌ సక్సెస్‌ అయినప్పటికీ జనాలను ఆకట్టుకుంటున్న కల్కి తమిళ నవల ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రమిది.