కరోనా నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఐపీఎల్ సహా అన్ని ఆటలపై నిషేధం

Manish Sisodia-No IPL, Other Sports Event In Delhi
Manish Sisodia-No IPL, Other Sports Event In Delhi

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ నేపథ్యంలో ఢిల్లీలోని కేజ్రీవాల్‌ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ప్రారంభం కానున్న ఐపీఎల్ సహా అన్ని ఆటలపై నిషేధం విధించింది. కరోనా విస్తరించకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా తెలిపారు. 200 అంతకు మించి ప్రేక్షకులు హాజరయ్యే ఏ స్పోర్ట్స్ ఈవెంట్ ను కూడా అనుమతించబోమని స్పష్టం చేశారు. మరోవైపు, మార్చ్ 31 వరకు విద్యాలయాలు, సినిమా థియేటర్లను మూసివేయాలంటూ ఢిల్లీ ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/