బలగం ఖాతాలో మరో రెండు అంత‌ర్జాతీయ అవార్డులు..

వేణు డైరెక్షన్లో దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన బలగం చిత్రం ఖాతాలో మరో రెండు అంత‌ర్జాతీయ అవార్డులు వచ్చి చేరాయి. జబర్దస్త్ ఫేమ్ వేణు డైరెక్షన్లో ప్రియదర్శి హీరోగా దిల్ రాజు నిర్మించిన బలగం మూవీ ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్స్ లోకి వచ్చి అఖండ విజయం సాధించింది. ఓ కుటుంబంలోని పెద్ద మ‌నిషి చ‌నిపోతే అక్క‌డ ఉండే మ‌నుషుల మ‌ధ్య ఉండే బంధాలు, అనుబంధాలు, భావోద్వేగాల చుట్టూ క‌థాంశంతో బ‌ల‌గం సినిమా రూపొందింది. ప్రియ‌ద‌ర్శి పులికొండ‌, కావ్యా క‌ళ్యాణ్ రామ్‌, ముర‌ళీధ‌ర్ గౌడ్‌, రూప ల‌క్ష్మి, సుధాక‌ర్ రెడ్డి త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందించారు.

కేవలం ఈ సినిమా ప్రశంసలకే పరిమితం కాకుండా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. ఇక ఈ చిత్రానికి ఇప్పటికే ఎన్నో అవార్డ్స్ రాగా..తాజాగా ఈ లిస్టులో మ‌రో రెండు అంత‌ర్జాతీయ అవార్డులు వ‌చ్చి చేరాయి. తెలంగాణ సంస్కృతి సాంప్ర‌దాయాల‌కు అద్దం ప‌ట్టి ఎన్నో ఇంట‌ర్నేష‌న‌ల్ అవార్డుల‌ను ద‌క్కించుంటోన్న బ‌ల‌గం స్వీడిష్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ 2023లో.. ఉత్త‌మ న‌టుడు అవార్డు ప్రియ‌ద‌ర్శికి, ఉత్త‌మ సహాయ న‌టుడు అవార్డును కేతిరి సుధాక‌ర్ రెడ్డికి వ‌చ్చింది.