మహిళా రిజర్వేషన్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం

రాజ్యసభలో బిల్లుకు వ్యతిరేకంగా ఒక్క ఓటూ పడలేదు

rajya-sabha-passed-women-reservation-bill

న్యూఢిల్లీః మహిళా రిజర్వేషన్ బిల్లుకు గురువారం రాజ్యసభ ఆమోదం తెలిపింది. డిజిటల్ డివైజ్ ద్వారా ఓటింగ్ ప్రక్రియ జరిగింది. మహిళా రిజర్వేషన్ బిల్లుపై పది గంటలకు పైగా సభలో చర్చ సాగింది. అనంతరం రాత్రి జరిగిన ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా 215 ఓట్లు వచ్చాయి. రాజ్యసభలో ఒక్కరు కూడా బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయలేదు. ఇప్పటికే లోక్ సభ మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలిపింది. లోక్ సభలో బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో 456 మంది సభ్యులు ఉండగా, 454 ఓట్లు అనుకూలంగా వచ్చాయి. రెండు ఓట్లు బిల్లుకు వ్యతిరేకంగా వచ్చాయి. ఈ రెండు ఓట్లు కూడా మజ్లిస్ పార్టీకి చెందినవి. ఉభయసభల్లో ఆమోదం నేపథ్యంలో రాష్ట్రపతి ఆమోదంతో చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ వర్తించనుంది.