ఆదిపురుష్ ట్రైలర్ చూసి ప్రభాస్ ఏమన్నాడంటే..

ప్రభాస్ – కృతి సనన్ జంటగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రనౌత్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న మూవీ ఆదిపురుష్. సాహో, రాధేశ్యామ్ సినిమాల తర్వాత రాబోతున్న ఈ మూవీ ఫై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో సైఫ్‌ అలీఖాన్‌ లంకాధిపతి రావణాసురుడుగా కనిపిస్తుండగా రాముడి గా ప్రభాస్ , సీతగా కృతి కనిపించనున్నారు. టీ-సిరీస్‌, రెట్రో ఫైల్స్ సంస్థలు అత్యంత భారీ బడ్జెట్‌తో దాదాపు రూ.500 కోట్లతో ఈ సినిమాను నిర్మించాయి. ఇక ఈ సినిమాను జూన్‌ 16న పాన్‌ ఇండియా లెవల్లో గ్రాండ్‌గా రిలీజ్‌ చేయబోతున్నారు.

ఈ క్రమంలో హైదరాబాద్‌లోని AMB మాల్‌లో జరిగిన ట్రైలర్ స్క్రీనింగ్‌కు ప్రభాస్, కృతి సనన్ హాజరయ్యారు. అనంతరం ఎక్స్‌పీరియన్స్‌ను మీడియాతో పంచుకున్నారు. ‘మొదటిసారి 3Dలో చూసినపుడు నేనైతే చిన్న పిల్లోడిని అయిపోయాను. ఇది నాకు గ్రేట్ ఎక్స్‌పీరియన్స్. ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైమ్ 3D అవడం, విజువల్స్ యానిమల్స్ మొహం మీదికి రావడాన్ని థ్రిల్‌గా ఫీల్ అయ్యాను. రేపు ఫ్యాన్స్ కోసం 60 థియేటర్స్‌లో స్క్రీనింగ్ వేస్తున్నాం. ముందు వాళ్లు చూడాలి, వాళ్లకు నచ్చాలి’ అన్నారు. అలాగే మీడియా మిత్రులను ఉద్దేశించి.. ‘మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాం క్లాప్స్ కొట్టారు కాబట్టి. ఇక ఈ టెక్నాలజీ ఇండియాలోనే ఫస్ట్ టైమ్. స్పెషల్‌గా 3D వెర్షన్ బిగ్ స్క్రీన్ కోసం రూపొందించబడింది. మూడు వారాల్లో మరొక పెద్ద అప్‌డేట్‌తో ముందుకొస్తాం. ఫ్యాన్స్ అందరూ ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాం. మీ రివ్యూ కూడా ఇవ్వండి. థాంక్యూ. లవ్ యూ’ అంటూ ప్రభాస్ చెప్పుకొచ్చాడు.