అమెజాన్ లో ‘బలగం ‘ స్ట్రీమింగ్

జబర్దస్త్ ఫేమ్ వేణు డైరెక్షన్లో ప్రియదర్శి హీరోగా దిల్ రాజు నిర్మించిన బలగం మూవీ సక్సెస్ ఫుల్ గా థియేటర్స్ లలో రన్ అవుతుండగానే..అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుండడం అందర్నీ షాక్ కు గురి చేస్తుంది. ఎలాంటి ప్రచారం కానీ , కనీసం స్ట్రీమింగ్ అవుతున్నట్లు అధికారిక ప్రకటన కానీ లేకుండానే అర్ధరాత్రి నుండి స్ట్రీమింగ్ అవుతుండడం చిత్ర యూనిట్ ను సైతం షాక్ కు గురి చేసింది.

ఈ నెల 3వ తేదీన విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకొని , బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతుంది. ఇంకా థియేటర్స్ లలో రన్ అవుతుండగానే..ఇప్పుడు ఓటిటిలోకి వచ్చేసింది. సినిమా విడుదలైన 20 రోజుల్లోనే ఎలా ఓటీటీకి వస్తుందనే అనుమానాలు రేకెత్తాయి. నిన్న రాత్రి 12 గంటల నుంచే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి వచ్చేసింది. థియేటర్స్ లలో చూడాలనుకున్న వారు ఇప్పుడు ఇంట్లోనే చూసేందుకు సిద్ధమవుతున్నారు.