కేసీఆర్ రెండు స్థానాల్లో పోటీ చేయడం ఫై రేవంత్ కామెంట్స్

అధికార పార్టీ బిఆర్ఎస్ ఎన్నికలకు సిద్ధమైంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తాలూకా లిస్ట్ ను సోమవారం తెలంగాణ భవన్ వేదికగా ప్రకటించారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఏడు చోట్ల తప్ప మిగతా నియోజకవర్గాల్లో సిట్టింగ్‌ అభ్యర్థులకే ఛాన్స్‌ ఇవ్వడం జరిగింది. గజ్వేల్‌, కామారెడ్డి స్థానాల్లో తాను పోటీ చేయనున్నట్లు సీఎం తెలిపారు. కాగా రెండు స్థానాల్లో కేసీఆర్ బరిలోకి దిగుతుండడం ఫై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. ఓడిపోతాననే భయంతోనే కేసీఆర్ రెండో స్థానాల్లో పోటీ చేస్తున్నాడని రేవంత్ అన్నారు.

ఎన్టీఆర్ తెలంగాణలో కల్వకుర్తి నియోజకవర్గం నుంచి ఓడి పోయాడు. కేసీఆర్ కూడా కామారెడ్డి, గజ్వేల్ నియోజకవర్గాల్లో ఓడిపోవడం ఖాయమన్నారు. తెలంగాణలో రాబోయేది ఇందిరమ్మ రాజ్యం అని , కాంగ్రెస్ హయాంలోనే అంతర్జాతీయ ఎయిర్ ఫోర్ట్, హైదరాబాద్ డెవలఫ్ మెంట్ జరిగిందని రేవంత్ అన్నారు. కానీ కేసీఆర్ తాను డెవలప్ చేశానని గొప్పలు చెప్పుకుంటున్నారని , కాంగ్రెస్ హయాంలోనే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉచిత విద్యుత్ అందజేశారని పేర్కొన్నారు. కేసీఆర్ మాయమాటలను తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. ఎప్పుడూ ఎన్నికలు జరిగిన కేసీఆర్ ని ఓడించాలనే ప్రజలు చూస్తున్నారని , వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారం ఖాయమని రేవంత్ జోస్యం చెప్పారు.