బాలయ్య తో బలగం డైరెక్టర్..

మున్నా మూవీ తో వెండితెర కు పరిచమైన వేణు..ఆ తర్వాత మంచి కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక జబర్దస్త్ షో తో మరింతగా దగ్గరయ్యారు. ఈ క్రమంలో బలగం మూవీ తో డైరెక్టర్ అవతరమెత్తి, యావత్ ప్రజానీకాన్ని కట్టిపడేసాడు. ఈ సినిమా చూసి మెగాస్టార్ సైతం ఆశ్చర్యపోయాడు. వేణులో ఇంత టాలెంట్ ఉందా..? అని ఒకవిధంగా షాక్ అయ్యాడు. ప్రస్తుతం వేణు దిల్ రాజు ప్రొడక్షన్ లోనే తన రెండో సినిమా చేయబోతున్నాడు. అయితే ఈ సినిమా నందమూరి బాలకృష్ణ తో అని తెలుస్తుంది.

బాలయ్య కోసం ఒక అదిరిపోయే కథ రెడీ చేసుకున్నాడట వేణు. మాస్ కమర్షియల్ అంశాలతో పాటుగా బలగం సినిమాలో లానే ఒక సున్నితమైన ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా సినిమాలో ఉన్నాయట. ఆల్రెడీ బలగంతో హిట్ అందుకున్నాడు కాబట్టి బాలయ్య ని కలిసి కథ చెప్పగానే పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారని తెలుస్తుంది. బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపుడి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత వేణుతోనే సినిమా ఉంటుందని అంటున్నారు. ఈ సినిమా కు సంబంధించిన ఎనౌన్స్ మెంట్ జూన్ 10న ఉండబోతుందని సమాచారం.