కస్టడీ సెన్సార్ రిపోర్ట్..

నాగ చైతన్య – కృతి శెట్టి జంటగా వెంకట్ ప్రభు డైరెక్షన్లో తెరకెక్కుతున్న మూవీ కస్టడీ. తెలుగు, తమిళ భాషల్లో మే 12వ తేదీన విడుదల కాబోతుంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను స్పీడ్ చేసింది. తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసింది.

సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు సినిమాకు యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసారు. సినిమా కంటెంట్ విషయంలో చిన్న చిన్న కరెక్షన్స్ మాత్రమే సూచించారంట. ఇక మూవీ బాగుందనే రిపోర్ట్ సెన్సార్ వారి నుంచి వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. కస్టడీ సినిమాని కూడా వెంకట్ ప్రభు డిఫరెంట్ కాన్సెప్ట్ తోనే మాస్ టచ్ తో ప్రెజెంట్ చేశారు. అరవింద్ స్వామీ చాలా గ్యాప్ తర్వాత ఈ మూవీలో పవర్ ఫుల్ విలన్ గా కనిపిస్తున్నాడు. మొదటి సారి నాగ చైతన్య పోలీస్ గా కనిపిస్తూ ఉండటం విశేషం.