సిఎం జగన్‌కు బోస్టన్‌ కమిటి నివేదిక

నివేదికలోని వివరాలపై జగన్ కు వివరణ

AP CM YS Jagan
AP CM YS Jagan

అమరావతి: ఏపి సిఎం జగన్‌కు రాజధాని అంశానికి సంబంధించి రూపొందించిన తమ నివేదికను బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) ప్రతినిధులు అందజేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్ ని వారు కలిశారు. ఈ నివేదికలో మూడు రాజధానులు, రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన సిఫారసులు ఉన్నాయి. ఇందులోని వివరాలను జగన్ కు బీసీజీ ప్రతినిధులు వివరించారు. కాగా, జీఎన్ రావు కమిటీ, బీసీజీ నివేదికలపై ఈ నెల 6న హైపవర్ కమిటీ సమావేశం కానుంది. ఈ నెల 20 లోగా హైపవర్ కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/